ఎన్నో సంవత్సరాల పోరాటాల , ఉద్యమాల తర్వాత 2014 వ సంవత్సరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కెసిఆర్ అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. దానితో తెలంగాణ రాష్ట్రానికి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఈయన పాలనలో అనేక పథకాలను ఈయన ప్రజల ముందుకు తీసుకువచ్చాడు. ఇందులో కొన్ని పథకాలు ప్రజలను అద్భుతమైన స్థాయిలో ఆకర్షించాయి.

కొన్ని పథకాలు ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన సక్సెస్ అయిన పథకాల గురించి ఉదాహరణకు చెప్పాలి అంటే ... పెళ్లి చేసుకున్న ప్రతి పేద అమ్మాయికి కళ్యాణ లక్ష్మి పథకం కింద ఒక లక్ష రూపాయలు అమ్మాయి కుటుంబ సభ్యులకు అందించడం , ప్రతి ఎకరానికి సంవత్సరానికి 10000 చొప్పున రైతు బంధు ఇవ్వడం , ఏదైనా ప్రమాదవశాత్తు 60 సంవత్సరాల లోపు రైతు చనిపోయినట్లయితే అతని కుటుంబానికి ఐదు లక్షల రూపాయల రైతు బీమా ను అందించడం , ఆసరా పెన్షన్లు ఇవ్వడం వీటికి కెసిఆర్ ప్రభుత్వంలో మంచి ఆదరణ జనాల నుండి వచ్చింది.

ఇక 2018 వ సంవత్సరంలో కూడా కేసీఆర్ మరోసారి గెలవడంతో ఈ పథకాలన్నింటినీ ఈయన మళ్ళీ పురాణావృతం చేశాడు. ఇకపోతే 2023 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇకపోతే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం భారీ ఎత్తున అప్పుల్లో ఉంది అని పలువురు చెబుతూ వస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మంచి పథకాలను అమలు చేస్తూనే మరికొన్ని పథకాలను కూడా వాటికి జోడించనున్నట్లు ప్రకటించింది.

కానీ ఇప్పటికే పెద్ద మొత్తంలో అప్పుల్లో రాష్ట్రం ఉన్నట్లు పలువురు చెబుతూ వస్తున్న సమయంలో ఇప్పుడు ఉన్న పథకాలకు మరిన్ని జోడించినట్లు అయితే వాటన్నింటినీ చాలా సంవత్సరాలు కొనసాగించడం సాధ్యమా అని కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అప్పుల్లో కూడా మంచి పథకాలను తీసివేయకుండా కొన్ని ప్రత్యామ్నాయాలను ఆలోచించే డబ్బును సమకూర్చి కొన్ని పనికిరాని పథకాలను అవసరమైతే తీసివేసైనా సరే పని కొచ్చే పథకాలను కొనసాగిస్తే బాగుంటుంది అని చాలా మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: