- వడ్డీలు కట్టలేక ప్రభుత్వం సతమతం..
- మహిళలకు 2500 సాధ్యమేనా..
- సీఎం రేవంత్ రాష్ట్రాన్ని గాడిలో పడేస్తారా.?


సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తొమ్మిది నెలలు గడిచిపోయింది. ఇప్పటికే దూకుడు పాలనతో ప్రజలకు ఎంతో దగ్గర అయ్యాడు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు అన్నింటిని సరిదిద్దుతూ ప్రజలందరికీ అర్థమయ్యేలా ప్రజా పాలన అందిస్తున్నారు. కానీ ఆయన ప్రజలకు ఎంత చేద్దామన్న ఒక అడుగు ముందుకు పడితే నాలుగు అడుగులు వెనక్కి అనే విధంగా రాష్ట్ర పరిస్థితి ఉంది. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులు తలకు మించిన భారంలా తయారైపోయాయి. కనీసం వాటికి వడ్డీలు కట్టాలంటేనే రాష్ట్ర ప్రభుత్వం తల కిందికి కాళ్లు మీదికి అనే విధంగా కష్టపడుతోంది. అప్పుల తిప్పలతో సతమతమవుతోంది. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరికొత్త ఆలోచనలతో ప్రభుత్వ పథకాలు అమలు చేస్తూనే అప్పులకు వడ్డీలు కడుతూ ముందుకు కదులుతున్నారు. ఎలాగైనా రాష్ట్రాన్ని ఈ ఐదేళ్లలో గాడిలో పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఇన్ని అప్పుల మధ్య ఆయన ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు సాధ్యమా అనే విధంగా కూడా చాలామంది మేధావులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో ఇప్పటికే నాలుగు గ్యారెంటీలు అమలు చేశారు. ఇంకా రెండు గ్యారెంటీలు అమలుకు నోచుకోలేదు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా 2500 రూపాయలు అందించడం. మరి ఇన్ని అప్పుల మధ్య ఈ పథకం అమలు చేయడం సాధ్యమవుతుందా.. ఆ వివరాలు ఏంటో చూసేద్దాం..

 అప్పుల తిప్పలు:
 తెలంగాణ రాష్ట్రం ఏపీతో విడిపోయి నాటికి 70 వేల కోట్ల అప్పులతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆరు లక్షల 71 వేల కోట్ల అప్పుల్లో నెట్టేసారు కేసీఆర్. ప్రస్తుతం ఈ అప్పులకు గాను 6000 కోట్లు నెలనెలా  మిత్తిలే కడుతున్నారు. ఆ విధంగా ఈ తొమ్మిది నెలల్లో కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన అప్పులు  దాదాపు 20 వేల కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. కానీ వీరు ఇదివరకు తెచ్చిన అప్పులకు కట్టినటువంటి వడ్డీలు ఇంతకంటే ఎక్కువగా కట్టినట్టు తెలుస్తోంది. ఈ విధంగా రేవంత్ సర్కార్ కొత్త అప్పులను తక్కువగా చేస్తూ పాత అప్పులను ఎక్కువగా కడుతోంది. ఈ విధంగా రేవంత్ రెడ్డి ఇతర మంత్రులను అధికారులు అందరినీ కలుపుకొని ఒక ప్రణాళిక బద్ధంగా పథకాలు అమలు చేస్తూ తక్కువ అప్పులు తీరుస్తూ ఎక్కువ మిత్తిలు కడుతూ ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. అలాంటి ఈ సందర్భంలో మహాలక్ష్మి పథకం అనేది  అమలు చేయడం ఈ మధ్యకాలంలో సాధ్యమయ్యేటట్టు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే రుణమాఫీ, ఉచిత బస్సు,ఉచిత కరెంటు,500 గ్యాస్ సబ్సిడీ అందిస్తూ పేద ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నారు.  ఈ పథకాలు నడిపించడం కోసమే వ్యయప్రయాసాలు పడుతున్నారు. అలాంటి ఈ తరుణంలో మహిళలకు 2500 ఇవ్వడం అంటే  సాధ్యమైన పని కాదని, ఈ మధ్యకాలంలో అయితే ఈ పథకాన్ని అమలు చేసే విధంగా ప్రణాళికలు లేవన్నట్టు తెలుస్తోంది. ఈ పథకం కోసం రేవంత్ రెడ్డి ఏదైనా ప్లాన్ చేస్తారా లేదంటే  ఇంకో ఏడాది తర్వాత అమలు చేస్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: