బ్రిటన్ పౌరులను పెళ్లి చేసుకునే విదేశీయులకు అదిరిపోయే శుభవార్త అందింది. అలా బ్రిటన్ పౌరులను పెళ్లి చేసుకుంటే ఇకపైన శాశ్వత.. పౌరసత్వం ఇవ్వబోతున్నారట. ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. ఆ చాలా దేశాలలో అనేక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వేరే దేశం వ్యక్తి మరొక దేశం లోకి వెళ్లాలంటే చాలా రూల్స్ పాటించాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ అలాగే వీసా లేకపోతే పక్క దేశంలో అడుగుపెట్టడం చాలా కష్టం.


అలాంటిది బ్రిటన్ లాంటి దేశాలలో మనం వెళ్లాలంటే మరింత రూల్స్ పాటించాల్సి ఉంటుంది. చాలామంది మన ఇండియా నుంచి చదువుకునేందుకు లండన్ వెళ్తూ ఉంటారు. మరికొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో లండన్ లో.. బతుకుదెరువు కోసం వెళ్లారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే... బ్రిటన్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది.


బ్రిటన్ కు చెందిన అమ్మాయిలను, లేదా అబ్బాయిలను పెళ్లి చేసుకునే వారికి ఊరటం ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు బ్రిటన్ పార్లమెంటులో... ఆ దేశ వలస అలాగే పౌరసత్వ వ్యవహారాల శాఖ మంత్రి సీమ మల్హోత్ర.. అదిరిపోయే ప్రకటన చేయడం జరిగింది. బ్రిటన్ అమ్మాయిలు లేదా అబ్బాయిని పెళ్లాడిన... విదేశీయులకు.. పర్మనెంట్ స్థిరత్వం ఇస్తున్నారు. అంటే బ్రిటన్ దేశానికి చెందిన అమ్మాయిలు లేదా అబ్బాయిలను పెళ్లి చేసుకునే విదేశీయుల.. భాగస్వాములు చనిపోయిన కూడా బ్రిటన్ లోనే ఉండేలా.. చర్యలు తీసుకుంటున్నారు.


అలా జీవిత భాగస్వాములను కోల్పోయిన విదేశీయులకు..  గతంలో 3000 ఫౌండ్స్  ఫైన్ కట్టాల్సి ఉండేది.     కానీ అక్టోబర్ 9వ తేదీ నుంచి ఎలాంటి ఫైన్ లేకుండానే అక్కడే స్థిరపడవచ్చు. లండన్ కు చెందిన భార్య లేదా భర్త చనిపోయాక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు విదేశీయులు చాలా కష్టపడుతున్నారు. వాళ్ల పిల్లలను... పోషించేందుకు చాలా కష్టాలు పడుతున్నారు. అందుకే ఈ అవకాశాన్ని కల్పించింది ఈ బ్రిటన్ సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: