- ఉచిత బస్సుతో పేదలకు లాభమేనా.?
- అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఉచిత బస్సు భారమేనా.?
- ఐదేళ్ల కొనసాగింపు ఉంటుందా.. బస్సు చక్రం ఊడుతుందా?


ప్రస్తుత కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసిన ఇదే తంతు కొనసాగుతోంది. ఒక రాష్ట్రంలో ఏదైనా ఉచిత పథకాన్ని మొదలు పెడితే చాలు ప్రజల్ని ఆకర్షించుకోవడం కోసం ప్రతి రాష్ట్రంలో ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఉచితాలతో రాష్ట్రాలను అప్పుల పాలు చేస్తూ చివరికి ప్రజలపై పన్నుల భారం పడేలా చేస్తున్నారు. మరి ఉచితాల వల్ల నిజమైన పేదలకు లాభం జరుగుతుందా.. లేదంటే వారిని సోమరిపోతులను చేస్తుందా.. ఏ ప్రభుత్వం చూసినా ఉచితం ఉచితం ఉచితం.. ఇలా ఉచితాల పేరుతో ఓ చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కుంటున్నారు. దీనివల్ల ఎక్కువగా పేద ప్రజలపైనే భారం పడుతుంది. పేదల కోసమే ఉచిత బస్ అని చెబుతారు. కానీ నిత్యవసర సరుకుల ధరలన్ని పెంచేస్తారు. ఓ చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కోవడం ఈ ప్రభుత్వాలకు ఒక అలవాటుగా మారిపోయింది. అలాంటి ఉచిత బస్సు పథకం కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు నడిపిస్తున్నాయి. అంతే కాదు ఏపీలో చంద్రబాబు కూడా ఉచిత బస్సు ప్రారంభించబోతున్నారు. మరి ఈ విధంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రభుత్వానికి తీరని నష్టం జరుగుతుందని కొంతమంది రాజకీయ మేధావులు చెబుతున్నారు. మరి ఆ నష్టమేంటి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం..

 వణికిస్తున్న బస్సు చక్రం:
 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముందుగా సంతకం పెట్టింది ఉచిత బస్సు పథకం పైనే. ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఫ్రీగా  ప్రయాణం చేయవచ్చు. కానీ ఈ పథకం గ్రామీణ ప్రాంత మహిళలకు ఎక్కువగా యూస్ అవ్వడం లేదని చెప్పవచ్చు. ఈ పథకం ద్వారా ఎక్కువగా ఉద్యోగులు,ఇతర ప్రాంతాల్లో వర్క్ చేసేవారు,కాలేజీ స్టూడెంట్స్ ఉపయోగించుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలు ప్రతి రోజైతే బస్సు ప్రయాణాలు చేయరు. ఏదో పండగలు, పబ్బాలు,ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు మాత్రమే వీరు బస్సులో వెళుతుంటారు. కానీ ఈ పథకం ఎక్కువగా ఉద్యోగస్తులకు మాత్రం మేలు చేస్తుందని చెప్పవచ్చు. అలాంటి ఉచిత బస్సు పథకం పెట్టడం తప్పు కాదు.కానీ అందులో కొన్ని లిమిట్స్ పెడితే బాగుంటుందని మేధావులు అంటున్నారు. ఉచిత బస్సులో ప్రయాణించేవారు ఉద్యోగులు అయితే వారికి ఫ్రీ ఉండకూడదు. అంతేకాదు సంవత్సర ఆదాయం ఎక్కువగా ఉన్న ఫ్రీ బస్సు ఉంచవద్దు. అలా గ్రామంలో అంతర్గత సర్వేలు చేయించి ఉచిత బస్సుకు ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే దానికి సంబంధించినటువంటి ఉచిత పాసులు లాంటివి జారీ చేస్తే నిజమైన పేదలకు ఉచిత బస్సు ద్వారా లాభం జరుగుతుందని కొంతమంది మేధావులు అంటున్నారు. ఈ ఉచిత బస్సు పథకం ద్వారా నెలకు 300 కోట్ల రూపాయల  భారం ప్రభుత్వం పై పడుతోంది. కాబట్టి ఉచిత బస్సు కొన్ని లిమిట్స్ పెట్టి అమలు చేస్తే బాగుంటుందని రాజకీయ మేధావులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: