తాజాగా బి ఆర్ ఎస్ నేతలు కూడా ఇలాంటి కామెంట్ చేస్తున్నారు. తెలంగాణలో శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ - హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వివాదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని అప్పుడు కాంగ్రెస్ కు అరికెపూడి గాంధీకి కామెంట్ చూపిస్తామని జగన్ తరహాలో వార్నింగ్ ఇచ్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ - ఏపీలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడి అప్పుడే ఏడాది కూడా కాలేదు. అప్పుడే ప్రత్యర్థి పార్టీలు మేమే అధికారంలోకి వస్తాం కక్ష సాధింపులకు దిగుతాం అంటూ హెచ్చరికలు జారీ చేయడం పట్ల రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర విమర్శలకు వ్యక్తం అవుతున్నాయి.
అయినా పవర్ లోకి వస్తే ప్రతీకారం తీర్చుకుంటామని అంటున్న బీఆర్ఎస్ వైసిపి నేతల వ్యాఖ్యలను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకుంటే ఈ రెండు పార్టీల పరిస్థితి వెంటనే ప్రశ్నలు కూడా ఉత్పన్న అవుతున్నాయి. ఎందుకంటే ఇంకా నాలుగు సంవత్సరాలు పాటు ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉంటాయి ... ఈ నాలుగేళ్లపాటు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి తలుచుకుంటే బీఆర్ఎస్ - వైసిపి పార్టీలకు చుక్కలు చూపిస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.