పీఏసీ చైర్మన్గా శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమించడంతో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యవహారం ... హరీష్ రావు చేసిన రచ్చ పార్టీకి పెద్ద డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ కింద మీద పడుతుంది. గాంధీని కూడా చిన్న మాట అనేందుకు హరీష్ రావు సిద్ధపడటం లేదు. కౌశిక్ రెడ్డి తాను గాంధీని అన్నానని .. ఆంధ్రోళ్లను అనలేదని పదేపదే చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఏమన్నాడో ఇప్పటికీ అందరికీ స్పష్టత వచ్చేసింది. ఈ విషయంలో బి ఆర్ ఎస్ వ్యూహం ప్రకారం చేసింది ఏమీ లేదు.. గాలి ఎటు వస్తే అటు కొట్టుకుపోయినట్టుగా రాజకీయం చేస్తున్నారు.
చివరకు అదే కారు పార్టీకి పెద్ద డ్యామేజ్ అవుతోంది. కేసీఆర్ రోజువారి పార్టీ వ్యవహారాలను పట్టించుకునేందుకు సిద్ధంగా లేరు. కేటీఆర్ ఇక్కడ లేరు హరీష్ రావు ఎక్కువగా సిద్దిపేటకు పరిమితం అవుతున్నారు. తనకు రావాల్సిన పిఎసి కోసం కౌశిక్ రెడ్డి రాజకీయం కోసం హరీష్ రావు ముందుకు వచ్చారు.. కానీ ఆయన దూకుడుతో చిక్కులు వస్తాయని హరీష్ రావు భావించలేదు. ఏది ఏమైనా బీఆర్ఎస్ లో ఇప్పుడు రాజకీయ నాయకత్వ వైరాగ్యం స్పష్టంగా కనిపిస్తోంది. చివరకు కారును తీసుకువెళ్లి ఎక్కడ గుద్ధి పెద్ద యాక్సిడెంట్ చేస్తారో అని కేడర్ కూడా ఆందోళన చెందుతుంది.