* జెసి కుటుంబంలో ఆణిముత్యంగా అస్మిత్ రెడ్డి
* తప్పు చేస్తే టిడిపి నేతలను కూడా వదలని యంగ్ లీడర్
* తాడిపత్రిలో వైసిపిని చిత్తు చేసిన అస్మిత్


 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలామంది యంగ్ లీడర్స్ ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ.. జెసి కుటుంబానికి ఉన్న ప్రత్యేకత ఇంత కాదు.  అలాంటి జెసి కుటుంబం నుంచి అస్మిత్ రెడ్డి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి... చరిత్ర సృష్టిస్తున్నారు. అంతేకాదు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో.. తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూడా... విజయం సాధించి చరిత్ర సృష్టించారుఅస్మిత్ రెడ్డి.

 అయితే వైసిపి అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో 6000 పైచిలుకు  తక్కువ ఓట్లతో విజయం సాధించారు అస్మిత్ రెడ్డి. అయినప్పటికీ.. అస్మిత్ రెడ్డి విజయం.. టిడిపికి ఎంతో ఊరట ఇచ్చింది. తాడిపత్రి నియోజకవర్గంలో కౌన్సిలర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు అస్మిత్ రెడ్డి. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఉమారెడ్డిల  సంతానమే ఈ అస్మిత్ రెడ్డి. 1987 సంవత్సరంలో జన్మించిన అస్మిత్ రెడ్డి...  ఎన్నో ఉన్నత చదువులు చదివారు.

 అయినప్పటికీ జెసి ప్రభాకర్ రెడ్డి  తరహాలోనే రాజకీయాల్లో... కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో.. యంగ్ లీడర్ గా కొనసాగుతున్న అస్మిత్ రెడ్డి... మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఆయనకు ఎమ్మెల్యేగా గెలవడం... ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన అస్మిత్ రెడ్డి.. తన మార్కు పాలనను స్పష్టంగా చూపిస్తున్నారు.

 తాడిపల్లి నియోజకవర్గంలో సొంత టిడిపి పార్టీ నేతలు తప్పు చేసిన కూడా... మీడియా ముందే నిలదీస్తున్నారు. ముఖ్యంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక దందా ప్రతిసారి తెరపైకి వస్తోంది. సొంత టిడిపి నేతల ఈ ఇసుక దందాను... నడిపిస్తున్నారట. దీంతో సొంత పార్టీ నేతలకే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తోంది జెసి కుటుంబం. ఈ విషయంలో పోలీసులకు కూడా ప్రతిసారి వార్నింగ్ ఇస్తున్నారు జెసి అస్మిత్ రెడ్డి. అలా ప్రతిసారి... ఏపీ రాజకీయాల్లో పాపులర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: