గత కొద్ది రోజులుగా స్టీల్ ప్లాంట్ ప్రేవేటికరణం కాబోతోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే వైసీపీ నేత విజయసాయిరెడ్డి కూడ ఈ విషయం పైన ఏపీ సీఎం పైన కూడా ఫైర్ అయ్యారు. స్టీల్ ప్లాంట్ సంక్షోమం ఏర్పడిందని దీంతో స్టీల్ ప్లాంట్ ను మూసి వేయడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనే విధంగా వార్తలు వినిపిస్తున్న తరుణంలో తాజాగా గాజువాక ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అయిన పల్లా శ్రీనివాస్ ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఒకవేళ ఇది మూసివేయడం కానీ ప్రైవేటీకరణం జరిగితే కానీ తన పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన వాక్యాలు చేశారు.



ఇలా పదవికి రాజీనామా చేసి కార్మికులతో కలిసి తాను కూడా పోరాట సమయంలో కొనసాగుతానంటూ తెలియజేశారు. రెండు రోజులుగా RINL లో కీలకమైన పరిణామాలు జరుగుతున్నాయని రా మెటీరియల్ కొరత కారణంగా విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉండే బ్లాస్ట్ ఫర్నిస్ -3 నీ మూసివేసినట్లు తెలుస్తోంది.. దీంతో అక్కడ పనిచేసే కార్మికులు సైతం ఆందోళనకు దిగుతున్నారు. ఇలా నెమ్మదిగా దశలవారీగా ప్లాంట్ షట్ డౌన్ చేసేందుకు యాజమాన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందనే విధంగా అక్కడ కార్మికులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.


ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్లను కాపాడుతానంటూ చెప్పిన హామీలు ఏమయ్యాయి అంటూ వైసీపీ పార్టీ నిలదీస్తోంది. వీటితో పాటుగా విశాఖ జిల్లాకు చెందిన కూటమి ఎమ్మెల్యేలు కూడా ఈ విషయం పైన ఒక్కసారిగా అలర్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దీంతో స్టీల్ కార్మికుల దీక్షా శిబిరానికి వెళ్లి ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా ఇద్దరు వెళ్లి కార్మికుల దగ్గరకు భరోసా ఇస్తున్నామంటూ తెలియజేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కారణ దిశగా జరుగుతున్న ప్రయత్నాలను తాము వ్యతిరేకిస్తున్నామని.. ఒకవేళ అలా జరిగితే గాజువాక జంక్షన్ లోని CITU మహాధర్నాక సైతం పిలుపునివ్వడం జరిగింది. దీంతో అక్కడ నేతలు కార్మికులు ఈ నేతలను ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: