తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి అవగాహన ఉన్నవాళ్లకు జనంపల్లి అనిరుధ్ రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2023 శాసనసభ ఎన్నికల్లో జడ్చర్ల నియోజకవర్గం నుండి అనిరుధ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. సాఫ్ట్ వేర్ రంగంలో ఇమడలేక తాను ఎమ్మెల్యే అయ్యానని అనిరుధ్ రెడ్డి ఒకానొక సందర్భంలో చెప్పుకొచ్చారు. తాను బీటెక్ చదివానని సాఫ్ట్ వేర్ జాబ్ చేశానని ఆయన తెలిపారు.
 
ఒక మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కూడా రన్ చేశానని అక్కడ సెటిల్ కాలేక ఎమ్మెల్యే అయ్యానని ఆయన తెలిపారు. గతంలో మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తీరు విషయంలో ఫైర్ కావడం ద్వారా అనిరుధ్ రెడ్డి వార్తల్లో నిలిచారు. ఎమ్మార్వో కార్యాలయం తలుపులు వేసి ఓ రిటైర్డ్ ఉద్యోగితో రెవెన్యూ రికార్డులు రాయిస్తున్న విషయం తెలిసిన అనిరుధ్ రెడ్డి సెలవు రోజున రెవిన్యూ రికార్డులు, భూములకు సంబంధించిన పంచనామా రాయించటంపై ఫైర్ అయ్యారు.
 
ప్రైవేట్ వ్యక్తులతో పంచనామా ఎలా రాయిస్తారని ఆయన తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక పనులకు పాల్పడుతున్న ఆర్ఐ‌ను సస్పెండ్ చేయాలని ఆ సమయంలో అనిరుధ్ రెడ్డి కలెక్టర్ కు సూచించడం జరిగింది. అవినీతి, అక్రమాలను అస్సలు సహించని ఎమ్మెల్యేగా అనిరుధ్ రెడ్డికి పేరుంది. జడ్చర్ల వాసులకు ఆయన మంచి పాలన అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
 
తెలంగాణ అభివృద్ధికి అనిరుధ్ రెడ్డి లాంటి యంగ్ ఎమ్మెల్యేల అవసరం ఎంతో ఉందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమయ్యాయి. బాలానగర్ మండలంలో గవర్నమెంట్ ఇనాం భూములను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ భూములను కాపాడేందుకు తాను రంగంలోకి దిగినట్లు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆ సమయంలో చెప్పుకొచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో తన మార్క్ తో ఈ ఎమ్మెల్యే ముందుకెళ్తున్నారు. యువతలో ఎంతోమందికి అనిరుధ్ రెడ్డి రోల్ మోడల్ గా నిలుస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: