* వారసత్వ రాజకీయాలకు వేదికగా ఆంధ్రప్రదేశ్

* మామ క్రేజ్ తో ప్రత్యక్ష రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చి పల్లె సింధూర రెడ్డి

* అద్భుతమైన వాగ్ధాటితో డైనమిక్ లీడర్ గా గుర్తింపు



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ అంతా యంగ్ లీడర్లదే.. ప్రస్తుతం వున్న రాజకీయ నాయకులంతా తమ రాజకీయ వారసులను ప్రకటిస్తున్నారు..దీనితో అధికార ప్రతి పక్ష పార్టీలలో యంగ్ లీడర్ల హవా కొనసాగుతుంది.. గత ఎన్నికలలో 151 సీట్లు సాధించి సంచలనం సృష్టించిన వైసీపీ పార్టీ 2024 ఎన్నికలలో తన పంథా మార్చుకుంది.. ప్రజలలో వ్యతిరేకత వున్న సీనియర్ నాయకులకు టికెట్ ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ ముందు నుంచి చెబుతూ వచ్చారు.. అయితే అటువంటి సీనియర్ నాయకులు తమకు టికెట్ కేటాయించకపోయినా తమ కొడుకుకు గాని, కూతురుకు గాని, కోడలకు గానీ టికెట్ కేటాయించమని ఎంతో రిక్వెస్ట్ చేయగా గెలుపు మీద బాగా ధీమా వున్న జగన్ సీనియర్ నాయకుల కుటుంబ సభ్యులకు టికెట్ కేటాయించారు.. ప్రత్యక్ష రాజకీయాలలోకి యువకులు రావాలనే ఉద్దేశంతో జగన్ యంగ్ లీడర్స్ అవకాశం ఇచ్చారనీ వైసీపీ చెప్పుకొచ్చింది.. పైగా యంగ్ లీడర్స్ అంతా కూడా ఉన్నత చదువులు చదువుకున్నవారు కావడంతో జగన్ ఆ రిస్క్ తీసుకున్నారు..


దీనితో కూటమి నేతలు సైతం పార్టీ టికెట్ల విషయంలో ఆచి తూచి నిర్ణయం తీసుకున్నారు.. వైసీపీ నిలబెట్టిన యంగ్ లీడర్స్ కు పోటీగా టీడీపీ కూడా యంగ్ లీడర్స్ కు ఛాన్స్ ఇచ్చింది.. అలా ప్రత్యక్ష రాజకీయాలలోకి దూసుకొచ్చిన యంగ్ లీడర్స్ చాలా మందే వున్నారు..వారిలో పల్లె రఘునాథ్ రెడ్డి కోడలు పల్లె సింధూర రెడ్డి ఒకరు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో... పుట్టపర్తి బరిలో నిలబడ్డ సింధూర రెడ్డి... అఖండ విజయాన్ని నమోదు చేసుకున్నారు.పుట్టపర్తి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన శ్రీధర్ రెడ్డిని ఇటీవల జరిగిన ఎన్నికల్లోఈ డైనమిక్ లేడీ చిత్తుచిత్తుగా ఓడించింది.అయితే ప్రస్తుత రాజకీయాలు సింధూర రెడ్డికి కొత్త అయిన కూడా తన మామ పల్లె రఘునాథరెడ్డి ఆశీస్సు లతో సింధూర రెడ్డి పుట్టపర్తి ప్రజల మన్ననలను పొందారు. అయితే ఎన్నో ఉన్నత చదువులను చదువుకున్న ఆమెకు  34 సంవత్సరాల వయసుకే ప్రజా సేవ చేసేందుకు అవకాశం వచ్చింది. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ పై మంచి పట్టు ఉండటంతో అసెంబ్లీ లో ఇంగ్లీష్ స్పీచ్ అదరగొట్టేసారు. నియోజకవర్గంలోని సమస్యలకు ఆమె సానుకూలంగా స్పందిస్తూ వారికీ అండగా నిలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: