* అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశం.!

* ఎమ్మెల్యేగా మొదటి సంపాదనతో PHCకి బ్యాటరీలు,ఇన్వెర్టర్లు ప్రధానం.!


* సొంత కారునే అంబులెన్స్ గా మార్చిన ఆదర్శ ఎమ్మెల్యే.!


* అందరికి ఆదర్శంగా నిల్చిన నిరుపేద ఎమ్మెల్యే.!

(అల్లూరి- ఇండియాహెరాల్డ్): ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రాజకీయా పరంగా రంపచోడవరం అంటే ముందుగా గుర్తొచ్చేది ఎమ్మెల్సీ అనంతబాబు. ఓ దళిత యువకుడి హత్య కేసులో ఆయన పేరు బాగా పాపులర్ అయింది.అక్కడ అనంతబాబు జరిపే అరాచకాలు అంతా ఇంతా కావని,  ముఖ్యంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులను వెంటాడుతారని కూడా విపక్షాలు ఆరోపిస్తూ ఉంటారు.అయితే అతని చేత బాధింపబడిన వారిలో ప్రస్తుత ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారు కూడా ఒకరు. ఆమె రాజకీయాల్లోకి రాక ముందు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేసే టైములో ఆమె భర్త విజయభాస్కర్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడుగా ఉన్నారు.టిడిపిలో చురుగ్గా వ్యవహరించేవారని దాంతో విజయభాస్కర్ను కట్టడి చేసేందుకు ఎమ్మెల్సీ అనంతబాబు, అతని అనుచరులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆయన వెనక్కి తగ్గకపోవడంతో భార్య ఉద్యోగాన్ని తీయిస్తామని బెదిరించి ఉన్నతాధికారులపై ఒత్తిడి చేసి ఆమెను ఉద్యోగం నుండి తీయించారు.తన వల్ల అధికారులు ఇబ్బందులు పడుతుండడం గమనించిన శిరీషా దేవి అంగన్వాడీ కార్యకర్త పోస్టును స్వచ్ఛందంగా వదులుకొని ఉద్యోగానికి రాజీనామా చేసి భర్తతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు.

మిరియాల శిరీషా దేవి ఎనిమిదేళ్ల అంగన్‌వాడీ టీచర్‌గా పని చేసి 2023 డిసెంబర్‌లో ఉద్యోగానికి రాజీనామా చేసి తన భర్త విజయ్ భాస్కర్ అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో యాక్టివ్ గా పనిచేయడం ప్రారంభించారు దాంతో అధినేత చంద్రబాబు దృష్టిలో పడడంతో కూటమి అభ్యర్థిగా ఎంపిక చేశారు.  2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రంపచోడవరంనియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9,139 ఓట్ల మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికైంది.గత జగన్ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు తీరని అన్యాయం చేసింది. అయితే అలాంటి అంగన్వాడీ టీచర్కి ప్రాధాన్యతనిస్తూ చంద్రబాబు టికెట్ ఇచ్చి మరీ రంపచోడవరంనుండి గెల్పించుకున్నారు.

శిరీష తాను ఎమ్మెల్యే ఐనా తర్వాత వచ్చిన మొదటి సంపాదనతో గిరిజన ప్రాంత హాస్పిటల్స్ కు కావాల్సిన ఇన్వెర్టర్, బ్యాటరీలు ఇచ్చారు.అలాగే బ్యాంకు నుండి పది లక్షల ఋణం తీస్కొని కారు కొని దానిని ఆదివాసీ దినోత్సవం సందర్బంగా నిరుపేదలకు అవసరమగురీతిలో అంబులెన్సుగా మార్చారు.వాహనం పై కూటమి నేతలతో, స్వర్గీయ నందమూరి తారకరామారావు చిత్ర పటాలతో వాహనం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే. అత్యవసర వైద్య సేవలు, హటాత్తు మరణం,ఆసుపత్రిలో మృతి చెందిన మృత దేహాలను తమ ఇళ్లకు తరలించేందుకు గిరిజనుల కోసం భర్త విజయ భాస్కర్ సహకారం తో వాహనాన్ని ఏర్పాట్లు చేశారు ఎమ్మెల్యే శిరీష దేవీ.ఎమ్మెల్యేగా,ఎంపీలుగా గెలిచినా తర్వాత ప్రజా సేవ కంటే ముందు తాము ఎన్నికల కోసం పెట్టిన ఖర్చును ఎలా సంపాదించాలి అని ఆలోచించే రాజకీయా నేతలున్న ఈ రోజుల్లో శిరీష లాంటి ఎమ్మెల్యే ఉండటం అనేది విశేషం.ఇటీవల గోదావరి వరదల వల్ల ఇబ్బంది పడుతున్న వారిని ఆమె స్వయంగా కలుసుకొని వారికి పునరావాసం ఏర్పాటు చేయడంలో టార్పరిన్లు అందించడంలో అధికారులను వెంటనే ఆదేశించి బాగా సక్సెస్ అయ్యారు.ప్రత్యర్థి పెట్టిన ఇబ్బందులే ఆమెను గుర్తింపు తీసుకొచ్చాయి. ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆమె పోరాట బాట పట్టారు. అలుపెరగకుండా కృషి చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ప్రజలతో మమేకం కావడం నేర్చుకున్నారు. ఐదు నెలల కిందట వరకు ఆమె సామాన్య అంగన్వాడీ టీచర్. కానీ నేడు రంపచోడవరం ఎమ్మెల్యే. సామాన్య కుటుంబం నుంచి వచ్చినందున, ప్రజల కష్టాలు తెలుసు కనుక ప్రజల మనసును గుర్తు ఎరిగి మసులుకుంటున్నారు.అయితే అందరూ నాయకులు ఆమె లాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే రాష్ట్రం, దేశం బాగుపడతాయి అనడంలో ఆశ్చర్యం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: