- ఎర్రబెల్లి కంచుకోట ను బద్దలు కొట్టిన యశస్విని..
- వయసు చిన్నదైనా మాట పెద్దది..
- రాజకీయాల్లోనే కాదు అభివృద్ధిలో కూడా పాలకుర్తి టాపే..

 2023 అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ కాంగ్రెస్ బిజెపి మధ్య విపరీతమైనటువంటి పోటీ ఏర్పడింది. ఈ ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. కానీ అన్ని అంచనాలు తలకిందులైపోయి కాంగ్రెస్ పార్టీ అద్భుత మెజారిటీతో  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంతేకాదు బిజెపి కూడా రాష్ట్రంలో మరింత పుంజుకుంది. కాంగ్రెస్ గెలుపుతో బిఆర్ఎస్ కంచుకోటలన్నీ కూలిపోయాయి.  30 నుంచి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తులు కొత్త కొత్త వ్యక్తుల చేతిలో ఓడిపోయారు. వారి రాజకీయ అనుభవం ముందు అంత ఏజ్ లేని వ్యక్తులు కూడా వారిని ఓడించి ఇంటికి పంపించారు. అలాంటి వారిలో చెప్పుకోవాల్సింది ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈయన కేసీఆర్ తర్వాత  అంతటి రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి ఈ నాయకుడిని కనీసం రాజకీయ అనుభవమంత ఏజ్ కూడా లేనటువంటి  మహిళా నేత యశస్విని రెడ్డి దారుణంగా ఓడించారు. ఎన్నో ఏళ్ల నుంచి పాలకుర్తిలో  ఎర్రబెల్లి దయాకర్ రావు కట్టుకున్న కంచుకోట ఆమె కూల్చేశారు. పాలకుర్తిలో గెలిచిన తర్వాత ఎలాంటి అభివృద్ధి చేస్తోంది.. ఎలా దూకుడు మీదుంది అనే వివరాలు చూద్దాం.

 పాలకుర్తి యంగ్ లీడర్ :
 ప్రస్తుత కాలంలో ఏ నియోజకవర్గంలో చూసినా 50 నుంచి 60,70,80 సంవత్సరాల నాయకులు మాత్రమే పాలిస్తున్నారు. వారికి ఇప్పటి యువత సమస్యలు ఏంటో అసలు అర్థం కావు. అంతా పాత రాజకీయాలే చేస్తూ ఉంటారు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం చాలా వరకు యువత అసెంబ్లీలో అడుగు పెట్టారు. అంతేకాదు వారి గళాన్ని కూడా అసెంబ్లీలో వినిపిస్తూ  నియోజకవర్గంలో  అభివృద్ధి చెందాలంటే ఎలాంటి పనులు చేయాలో కూడా వారు వివరిస్తున్నారు. ఎందుకంటే ఈ గెలిచినవారు పెద్ద పెద్ద చదువులు చదువుకొని అమెరికా లాంటి దేశాలు వెళ్లి వచ్చి అక్కడి పరిస్థితులు చూసొచ్చారు. కాబట్టి నియోజకవర్గాలను అభివృద్ధి చెందించాలంటే ఫస్ట్ అక్కడ చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు దొరకాలి. విద్యార్థులకు మంచి చదువు అందాలి. దానివల్ల ఆటోమేటిక్ గా నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని అంటున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది యశస్విని రెడ్డి..  అమెరికాలో జాబ్ చేసి  అత్తగారి ద్వారా పాలకుర్తిలో పోటీ చేసి గెలిచింది.


అలాంటి ఈమె పాలకుర్తి అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు,విద్యార్థుల స్టడీ మీద ఫోకస్ పెట్టింది. ప్రతి విద్యార్థి చదువు ద్వారానే అభివృద్ధి చెందగలరని ఆమె అసెంబ్లీ సాక్షిగా గళం వినిపిస్తోంది. చెట్టు వేరు బాగుంటేనే బాగా ఎదుగుతుందనే నినాదంతో విద్యార్థి పాఠశాల దశలోనే బాగా ఎదిగితే భవిష్యత్తు బాగుంటుంది అనే నినాదంతో  పాఠశాలల అభివృద్ధి కోసం విద్యార్థుల దశ మార్చడం కోసం ముందుకు వెళ్తోంది..  ఈ విధంగా అసెంబ్లీ సాక్షిగా  ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులతో పాటు, పక్కా భవనాలు, ప్రతి స్కూల్లో అన్ని సబ్జెక్టులకు అనుభవజ్ఞులైనటు వంటి టీచర్లు ఉండాలని ఆమె అసెంబ్లీ సాక్షిగా అడుగుతోంది. ఈ విధంగా  విద్యా వ్యవస్థను బాగు చేస్తే ఆటోమేటిక్ గా వారి కుటుంబం అభివృద్ధి చెంది, తర్వాత గ్రామం,మండలం, జిల్లా, నియోజకవర్గం,రాష్ట్రం ఇలా అంతా అభివృద్ధి చెందుతుందని యశస్విని రెడ్డి భావిస్తోంది.  ఒక చదువుకున్న యువత అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో యశస్విని రెడ్డిని చూసి తప్పకుండా నేర్చుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: