వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వచ్చాక భారతీయ రైల్వేలో ఎటువంటి మార్పులు సంభవించాయో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలోనే టాటానగర్ - పాట్నాతో సహా బీహార్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజే నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను బహుమతిగా ఇవ్వనున్నట్టు సమాచారం. అవును, టాటానగర్-పాట్నా, వారణాసి-దియోఘర్, గయా-హౌరా, భాగల్పూర్-హౌరా వందే భారత్ సహా 6 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. ఇవి స్టార్ట్ అయితే బీహార్ ప్రయాణికులు 3 వందే భారత్ రైళ్ల నుండి నేరుగా సేవలు అందనున్నాయి. కాగా ఇక్కడ పాట్నా జంక్షన్‌లో టాటానగర్-పాట్నా వందే భారత్ రైలు రాకపై ఈరోజే స్వాగత కార్యక్రమం జరగబోతోంది.

కాగా దీనికోసం ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంని వేదికగా మార్చుకున్నారు. ఈ సాయంత్రం 7 గంటలకు జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, స్థానిక ఎంపీలు - ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రముఖులను రైల్వే ఆహ్వానించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. టాటానగర్ వందే భారత్ స్పెషల్ (2893) టాటానగర్ నుండి ఉదయం 10.15 గంటలకు బయలుదేరి రాత్రి 8.15 గంటలకు పాట్నా చేరుకుంటుంది. గయా-హౌరా వందే భారత్ ప్రారంభోత్సవ స్పెషల్ గయా నుండి ఉదయం 11.00 గంటలకు బయలుదేరి 19.00 గంటలకు హౌరా చేరుకుంటుంది.

అదేవిధంగా... 18 సెప్టెంబర్ నుండి, (22303 / 22304) హౌరా - గయా - హౌరా వందే భారత్ గురువారం తప్ప ప్రతిరోజూ నడుస్తుందని సమాచారం. కాబట్టి ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవలసిందిగా భారతీయ రైల్వే కోరుకుంటోంది. ఇక బైధ్‌నాథ్‌ధామ్ - వారణాసి వందే భారత్ (02249) ప్రారంభోత్సవ స్పెషల్ బైధ్‌నాథ్‌ధామ్‌లో ఉదయం 11.00 గంటలకు స్టార్ట్ అయ్యి, మధ్యాహ్నం 21.00 గంటలకు వారణాసికి చేరుకుంటుంది. వారణాసి - దియోఘర్ - వారణాసి వందే భారత్ రైలు (22500/22499) క్రమం తప్పకుండా నడుస్తుంది. ఈ రైలు వారణాసి - డియోఘర్ నుండి మంగళవారం మినహా వారానికి ఆరు రోజులు నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: