ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికలలో చిత్తూరు జిల్లాలో అందరూ ఓడిపోయారు. వైసీపీ నుంచి పోటీ చేసిన వారిలో కేవలం ఇద్దరు మాత్రమే గెలిచారు. ఆ ఇద్దరు కూడా పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన వారే. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తంబ‌ళ్ల‌పల్లి నుంచి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి విజయం సాధించారు. తాజాగా చిత్తూరు జిల్లా నేతల సమావేశంలో జగన్ మాట్లాడుతూ ఆ కిటుకు ఏదో మాకు కూడా చెప్పొచ్చు కదా అన్న అని చేసిన వ్యాఖ్యలు పెద్దిరెడ్డి గుండెల్లో మంటపెట్టాయని.. వైసిపి వర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి.


చిత్తూరు జిల్లాలో వైసిపి రెండు చోట్ల మాత్రమే గెలిచింది. ఇది జగన్‌లో అనుమానానికి బీజం వేసిందని.. పెద్దిరెడ్డి కోవర్టుగా మారి తాము గెలిచి అందరినీ ఓడగొట్టారని.. జగన్ అనుమానిస్తున్నారని.. జగన్ వ్యాఖ్యలతో తేలిపోయిందని.. వైసిపి వాళ్లే చెవులు కోరుకుంటున్న పరిస్థితి. పెద్దిరెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు నెంబర్ 2 గా చలామణి అయ్యారు. చంద్రబాబు కుప్పం, బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గాలలో వందల కోట్లు ఖర్చుపెట్టి అయినా ఓడిస్తానని జగన్‌కు హామీ ఇచ్చి చాలా పెద్ద పెద్ద ఆపరేషన్లు చేశారు. కానీ.. అక్కడ వైసిపి ఘోరంగా ఓడిపోయింది. పైగా టిడిపి మెజార్టీ పెరిగింది. అంతే కాదు పెద్దిరెడ్డి ఇంచార్జిగా ఉన్న అనంతపురంలో టిడిపి దెబ్బకు వైసిపి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.


చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి.. ఆయన సోదరుడు మాత్రమే గెలిచి అందరూ ఓడిపోయారు. ఇప్పుడు ఈ ఫలితాలు నెమ‌ర వేసుకుంటున్న జగన్ పెద్దిరెడ్డిని నమ్మకూడదన్న నిర్ణయానికి వచ్చారని.. వైసిపి వాళ్లే చెబుతున్నారు. అందుకే రోజాను వదిలేయాలని చెప్పి ముందు జగన్ అనుకున్నా.. ఇప్పుడు ఆమె డిమాండ్లు అన్ని తీర్చి నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా వర్గాన్ని పెంచి పోషిస్తున్న పెద్దిరెడ్డికి షాక్ ఇస్తూ.. పెద్దిరెడ్డి అనుచరులుగా ఉన్న కేజే కుమార్, కేజే శాంతి దంపతులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక పార్టీ నేతలు సమావేశంలో కూడా జగన్ పెద్దిరెడ్డికి చాలా దూరంగా సీటు ఇచ్చారట. ఇక ఫొటోలు దిగే సమయంలోనే జగన్ పక్కన పెద్దిరెడ్డి లేరు. ఈ పరిణామాలతో జగన్ పెద్దిరెడ్డిని నమ్మటానికి ఏమాత్రం ఇష్టపడటం లేదన్న ప్రచారం వైసిపి వర్గాల్లోనే నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: