ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం... తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలు ఏకమై... జగన్మోహన్ రెడ్డి పార్టీ దారుణంగా ఓడించాయి. దీంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 164 స్థానాలు దక్కించుకుంది తెలుగుదేశం కూటమి. అటు పార్లమెంటు స్థానాల్లో నాలుగు మినహా అన్ని స్థానాలను కూటమి ప్రభుత్వం గెలుచుకోవడం జరిగింది.

 అయితే జగన్ మోహన్ రెడ్డిని ఓడించిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంత్రి పదవులను కూడా  కేటాయించింది. సీఎం చంద్రబాబు నాయుడు... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అటు డిప్యూటీ ముఖ్యమంత్రితో మరో మంత్రి పదవులను  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దక్కించుకోగలిగారు. అంతేకాదు జనసేన పార్టీలో ఉన్న నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కు కూడా పదవులు వచ్చాయి.

ఇక ప్రస్తుతం ఏపీలో... నామినేటెడ్ పదవుల రచ్చ కొనసాగుతోంది. ఈ నెలాఖరులో నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్లాన్ వేస్తున్నారట. మొన్నటి వరకు భారీ వర్షాలు అలాగే వరదలు రావడంతో ఈ నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ఆలస్యమైంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి 60 శాతం, జనసేనకు 30% అటు బిజెపి పార్టీకి 10 శాతం పదవులు ఇచ్చేలా... చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట. అయితే జనసేన అలాగే, భారతీయ జనతా పార్టీ లకు తక్కువ పదవులు.. ఇవ్వడంపై చంద్రబాబుపై విమర్శలు వస్తున్నాయి.మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.


అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం వర్సెస్ జనసేన నేతల మధ్య చాలా చోట్ల వివాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతల మధ్య కూడా కొన్ని వివాదాలు తెరపైకి వస్తున్నాయి. విజయవాడ నుంచి మొదలు పెడితే చిత్తూరు జిల్లా వరకు... కూటమిలో ఉన్న పార్టీల మధ్య... ఏదో ఒక అంశం పైన వివాదం తెరపైకి వస్తోంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే వర్మను జనసేన నేతలు అసలు పట్టించుకోవడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: