అయితే ఇలాంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల ముందే ఎండ కట్టేందుకు గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు రంగంలోకి దిగుతున్నారు. ఇందులో భాగంగానే మరో 10 రోజుల్లోనే... తెలంగాణ భవన్లో అదిరిపోయే మీటింగ్ నిర్వహించబోతున్నారట కేసీఆర్. రేవంత్ రెడ్డి వైఫల్యాలు అయిన రుణమాఫీ, రైతు బంధు, వరద బాధితుల సమస్యలు, అన్నదాతల ఆత్మహత్యలు లాంటి అంశాల పైన.. పార్టీ నేతలతో చర్చించనున్నారట.
ఇక ఈ సమావేశానికి టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అందరూ, ముఖ్యమైన నేతలు అందరూ ఈ తెలంగాణ భవన్ లో నిర్వహించే సమావేశానికి రాబోతున్నారట. ఈ సమావేశం నిర్వహించిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి కల్వకుంట్ల చంద్రశేఖర రావు వెళ్ళనున్నారని సమాచారం. బస్సు యాత్ర నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా రంగం సిద్ధం చేస్తున్నారట.