సోమేశ్ కుమార్ అంటే రాష్ట్రంలో తెలియని వారుండరు. కేసీఆర్ కు ఎంతగానో నమ్మకస్తుడు. అందుకే ఆయన రిటైర్డైనా తన ప్రభుత్వంలో మరోసారి నియమించుకున్నారు. ప్రాధాన్యం పోస్టు ఇచ్చి పెద్ద పీట వేశారు. సీఎస్ గా బాధ్యతలు అప్పజెప్పారు. సోమేశ్‌ కుమార్ సారథ్యంలోన ఉన్న జీఎస్టీలో పెద్ద ఎత్తున కుంభకోణం వెలుగుచూసింది. కేసీఆర్ కు సాయం చేయబోయి ఆయన ఇరుకున్నట్లు ప్రచారం జరుగుతున్నా.. అంత పెద్ద కుంభకోణాన్ని చూసి తెలంగాణ ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.


మాజీ కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి లేఖతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో విచారణ చేపట్టిన అధికారులు ఈ కేసులో కుంభకోణం జరిగినట్లు ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారించారు. రూ.1000 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు తెలంగాణ కమర్షియల్ ట్యాక్స్ విభాగం ఆరోపిస్తోంది. దాంతో ఏ-5 గా సోమేశ్‌ కుమార్ ని చేరుస్తూ కేసు నమోదు చేశారు.


అయితే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలిసింది  సోమేశ్ కుమార్ కు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సోమేశ్ తో పాటు మరికొందరి అధికారులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఏ1గా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వీ కాశీ విశ్వేశ్వరరావు, ఏ2గా ఉప కమిషనర్ ఏ.శివరాం ప్రసాద్, ఏ3గా హైదరాబాద్ ఐఐటీ ప్రొఫెసర్ శొభన్ బాబు, ఏ4గా ప్లియంటో టెక్నాలజీలు కంపెనీలు ఉన్నాయి.


వస్తువులు సరఫరా చేయకున్నా.. చేసినట్లు ఫేక్ ఇన్ వాయిస్ లను సృష్టించినట్లు.. వాటికి రిటర్న్స్‌ క్లైయిమ్ చేసినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. అయితే తప్పుడు ఇన్ వాయిస్ లతో రాష్ట్రానికి రావాల్సిన రూ.1400 కోట్ల ఆదాయాన్ని పక్కదారి పట్టించారని. ఇందులో సోమేశ్ కుమార్ కీలకం అని సీఐడీ గుర్తించింది. అందుకే ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు రెఢీ అయినట్లు సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ కు సాయం చేసి ఇప్పుడు సోమేశ్ కుమార్ ఇరుక్కుపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: