- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .

ఆంధ్రప్రదేశ్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా ఓటర్ ల నమోదు ప్రక్రియ మొదలుపెట్టారు. కృష్ణ - గుంటూరు ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గం ... అలాగే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలకు ఓట్ల నమోదు ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ ఆరో తేదీ వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎప్పటికప్పుడు కొత్త‌ ఓటర్ లిస్ట్ చేసుకుంటారు .. పాత ఓటర్ల లిస్టు పనిచేయదు .. కొత్తగా ఓటు హక్కుకు అర్హులైన వారితో పాటు గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా మరల కొత్తగా ఓటు హక్కును నమోదు చేయించుకుని పొందాల్సి ఉంటుంది .. ఆన్లైన్లో కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారంతా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు గా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.


ఓటర్ నమోదుకు గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ ప్రొవిజనల్ ఫోటో ... ఆధార్ ఓటర్ ఐడిని సమర్పించాల్సి ఉంది. టీచర్లు - గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా ఫారం 18 - 19 ద్వారా ఓటర్ గా నమోదు కావాలని అధికారుల కోరుతున్నారు. గతంలో మూడు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో టిడిపి ఘనవిజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్లో ఈ యేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వం ఘనవిజయం సాధించి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. అనంతరం జరిగిన విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో మాత్రం వైసీపీకి భారీ మెజార్టీ ఉండడంతో కూటమి నుంచి ఎవరు ? పోటీ చేయలేదు. దీంతో వైసిపి నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సీనియర్ నేత బొత్స‌ సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇది ఇలా ఉంటే వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించేందుకు ఎవరికి వారు రకరకాల ఎత్తులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: