వైసీపీలో మాజీ మంత్రి ఆ పార్టీలో కీల‌కంగా వ్యవహరించిన సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పైకి ఏమీ తెలియని వాడిలా కనిపిస్తారు .. కానీ తెరవెనక ఆయన చేసే వ్యవహారాలను అస్సలు ఎవ్వరూ ఊహించలేరు. ఆయన సోదరుడు అంబటి మురళీకృష్ణతో కలిసి గుంటూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తున్నారు. ఎప్పుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ కంపెనీ పెట్టించి మెల్లమెల్లగా గుంటూరు నగరంలోని బజరంగ్ జుట్టు మిల్లు స్థలం సొంతం చేసుకున్నారు. ఆ స్థలం తీసుకోవ‌డం వెన‌క‌ ఉన్న డీలింగ్స్ ఇంకా బయటకు రాలేదు .. కానీ ఆ జూట్ మిల్ వల్ల వేలాది మంది కార్మికులు ఉపాధి పొందేవారు. ఇప్పుడు ఆ మిల్లు మూతపడింది. ఆ ప్లేస్లో బిల్డింగులు క‌డుతున్నారు.


అంబటి రాంబాబు సోదరుడు అంబటి మురళి కృష్ణ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టారు.. అన్నట్టు మురళీకృష్ణ కూడా ఈ ఎన్నికలలో గుంటూరు జిల్లాలోని పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. మంత్రి హోదాలో ఉన్న అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి పోటీ చేసి కన్నా లక్ష్మీనారాయణ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఇక అంబటి మురళీకృష్ణ రియల్ ఎస్టేట్ కంపెనీ నగరం మ‌ధ్య లో ఉన్న రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న బజరంగ్ జుట్టు మిల్ స్థలంలో అపార్ట్మెంట్ల నిర్మాణం చేపట్టింది. ఐదు అంతస్తులకు అనుమతులు తీసుకుని ఏకంగా 15 అంతస్తులు క‌డుతున్నారు.


అది 18 అంతస్తులకు చేరింది అని వెబ్సైట్లో పెట్టారు. కనీస అనుమతులు లేకుండానే కట్టేస్తున్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల‌ నరేంద్ర కుమార్ ఈ విషయాన్ని బయట పెట్టడంతో ఇప్పుడు అపార్ట్మెంట్ ఆగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. రైల్వే వాళ్ళు కూడా 5 అంతస్తులకే ఎన్ఓసి ఇచ్చారు. కార్పొరేషన్ అసలు అలా అపార్ట్మెంట్లు కట్టకూడదని నివేదిక రెడీ చేసింది .. అంటే ఇప్పుడు ఆ అపార్ట్మెంట్లో అమ్మలేరు .. కొనలేరు. కానీ ఇప్పటికే బుక్ చేస్తున్న వారికి మాత్రం డబ్బు తిరిగేవ్వాలి. మొత్తంగా రాజకీయం అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించాలనుకునే వారికి గడ్డం పరిస్థితి తప్పదు అని ఈ సంఘటన రుజువు చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: