అదుర్స్‌ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ చెప్పే "తెలీదు... గుర్తులేదు... మార్చిపోయా" డైలాగ్ సూపర్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీన్నే కొంతమంది వైసీపీ నేతలు ఉపయోగిస్తూ ఏపీ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసులో వైసీపీ నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాష్ తదితరులు నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వాళ్లని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ సమయంలో వీళ్లు ముగ్గురు ఈ మూడు పదాలను విరివిగా వాడినట్లు సమాచారం.

ముగ్గురు నేతలకు పాస్‌పోర్టు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో.. మంగళగిరి పోలీస్‌స్టేషన్‌లో ఆ పని చేశారు. వెంటనే మంగళగిరి డీఎస్పీ 2021లో టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనపై వారిని ప్రశ్నించారు. ఈ కేసు వివరాలను పోలీసులు ప్రస్తావించగా వైసీపీ నేతలు కూడా విచిత్రంగా స్పందించినట్లు సమాచారం. దాడి, వారి పాత్ర గురించి చాలా ప్రశ్నలకు వారి కామన్ ఆన్సర్, "మేం మర్చిపోయాము, మాకు తెలియదు, మాకు గుర్తు లేదు."

ఈ విధ్వంసంలో తమకు సంబంధం లేదని నేతలు చెప్పినట్లు సమాచారం. నాటి సీఎం జగన్‌పై టీడీపీ నేతలు అభ్యంతరకరమైన పదజాలం వాడడంతో ఆగ్రహంతో ఆ పార్టీ సభ్యులే ప్రవర్తించారని ఆరోపించారు. వైసీపీ నేతలు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో స్పష్టమైన ఫలితాలు రాకుండానే పోలీసులు విచారణ ముగించాల్సి వచ్చింది. ఈ కీలక కేసును భవిష్యత్తులో ఎలా పరిగణిస్తారో చూడాలి. మొత్తం మీద పోలీసుల విచారణలో వైసీపీ నేతలు ఊహించని సమాధానాలు చెప్పి వారికి పట్టపగలే చుక్కలు చూపించారు. మరి అసలు నిజాన్ని రాబట్టడానికి పోలీసులు ఎలాంటి చర్యలు చేపడతారో చూడాలి.  

 మరోవైపు వైసీపీ జగన్ కృష్ణా నది బ్రిడ్జి కూలగొట్టి లక్ష మందికి పైగా ప్రజలను చంపాలని కుట్ర పండినట్లు టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు ఒకవేళ వారి ఆరోపణలో నిజం ఉందని తేలితే జగన్ తో పాటు అలా పని చేసిన వైసీపీ నేతలు అందరూ కూడా జైలు పాలు కావాల్సి వస్తుంది. విజయవాడ వరదలను రాజకీయంగా ఇరు పార్టీలు కూడా వాడుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: