కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత రవ్‌నీత్ సింగ్ బిట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి బిట్టు బిహార్‌లోని భాగల్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలోనే నంబర్. 1 టెర్రరిస్టు అని ఒక షాకింగ్ కామెంట్ చేశారు. ఆ కామెంట్ వినగానే అందరూ నివ్వెరపోయారు.

సిక్కుల్లో గొడవ పెట్టేందుకే రాహుల్‌గాంధీ కుట్ర చేస్తున్నారని ఈ కేంద్ర మంత్రి అలిగేషన్స్ చేశారు. అందుకే ఆయన్ని టెర్రరిస్ట్ అంటున్నానని వివరణ ఇచ్చారు. కేంద్రం రాహుల్ తలపై రివార్డు ప్రకటించాలని కూడా ఆయన డిమాండ్ చేసి మరింత దిగ్బ్రాంతికి గురి చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేదల ఇళ్లకు వెళ్లి ఫోటోలు దిగడమే కానీ చేసేదేమీ లేదని అన్నారు. భారతదేశంలోని కష్టాలు అతనికి ఎప్పుడు అర్థం కావని ఎందుకంటే ఆయన విదేశాలలో పెరిగారు అని అన్నారు. రాహుల్ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ విదేశీయులేనని రవ్‌నీత్ సింగ్ బిట్టు చెప్పుకొచ్చారు.

రాహుల్ గాంధీకి దేశాన్ని ప్రేమించడమే తెలియదని కూడా కామెంట్ చేశారు. అందుకే పబ్లిక్ లో దేశం గురించి చాలా తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కోసారి ఓబీసీ గురించి, ఒక్కోసారి కులం గురించి కామెంట్లు చేస్తున్నారని ఎద్దేవా చేశారు., "రాహుల్ గాంధీ ఏం మాట్లాడాలో, ఏం చేయాలో తెలియదు. 2009లో మేమిద్దరం ఒకేసారి ఎంపీలం అయ్యాం, కానీ ఇప్పటికి ఆయన తనలాగా దేశం గురించి ఏమీ అర్థం చేసుకోలేకపోయార"ని రవ్‌నీత్ సింగ్ బిట్టు ఎగతాళి చేశారు.

రాహుల్ గాంధీ రిక్షా పుల్లర్ వద్దకు వెళుతారు కానీ అతని బాధ ఏమిటో ఎప్పటికీ ఆయన అర్థం చేసుకోలేరు అని అన్నారు. నేటికీ పేద ప్రజల బాధను రాహుల్ గాంధీ తెలుసుకోలేకపోయారని అన్నారు. రవ్‌నీత్ సింగ్ బిట్టు ఇంకా మాట్లాడుతూ.. సిక్కులు కంకణాలు, తలపాగా ధరించకుండా ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: