ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసక విధానం తీసుకువచ్చారు.. అయినా కూడ వీటి పైన చాలానే విమర్శలు వినిపించాయి. ఇప్పుడు తాజాగా రవాణా ఖర్చుల భారాన్ని మరింత తగ్గించేలా ఏపీ సీఎం చంద్రబాబు ఒక సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రమంతటా కూడ ఒకే రకమైన రవాణా చార్జీలను అమలు చేసే విధంగా ప్లాన్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. అయితే దూరాన్ని బట్టి రవాణా చార్జీలను స్వల్పంగా తగ్గించేలా ఒక జీవోను విడుదల చేసింది. 10 కిలోమీటర్ల వరకు ట్రాక్టర్ కు కిలోమీటర్ కు చొప్పున టన్నుకి 13.5 రూపాయలు వసూలు చేయాలని సూచించినది. అయితే 4.5 టన్నుల మినహాయింపు ఉంటుందట.


ఇక ఆరు టైర్ల ట్రక్కులో విషయానికి వస్తే కిలోమీటర్లకు 10.70 పైసలు తీసుకొనేలా.. అలాగే 10 టన్నుల వరకు మాత్రమే వసూలు చేసేలా చూస్తోంది.. మిగతా పెద్ద టైర్ ట్రక్కులకు కిలోమీటర్ 9.40 రూపాయల చొప్పున 35 టన్నుల వరకు వసూలు తెలియజేస్తున్నారు. ఆన్లైన్లో బుకింగ్ చేసేటప్పుడు ఇంటి వద్దకు డెలివరీ కావాలనే వాళ్ళు కచ్చితంగా ఆప్షన్ తీసుకోవాలని లారీలోని ఇసుక సరఫరా చేస్తామంటూ తెలియజేశారు.


అయితే ఇందులో భాగంగా ఇసుక రీచ్ లో స్టాక్ పాయింట్ల నుంచి వినియోగదారుల ఇళ్లకు రవాణా చేసేందుకు  ఎవరైనా లారీల యజమానులు ఆసక్తిగా ఉంటే కచ్చితంగా వారు గనుల శాఖ వద్ద వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలియజేశారు. ఇప్పటికే సుమారుగా ఏపీ అంతా కూడా 3000 లారీల యజమానులు తమ వాహనాలను ఇసుక ట్రాన్స్ఫర్ చేసే దానికి వినియోగించుకుంటున్నారంటూ తెలిపారు. అయితే ఇవన్నీ కూడా జిపిఎస్ ఉన్నవి కావడంతో ఇసుక దారి మల్లకుండ ఉండేందుకు కూటమి ప్రభుత్వం కూడా సన్నహాలు చేస్తూ ఇలా ప్లాన్ చేస్తోంది. మరి ఈ తగ్గించిన భారం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: