ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, నవ్యాంధ్రప్రదేశ్ లో కానీ చంద్రబాబు నాయుడుకు ఉన్న క్రేజ్ మామూలు క్రేజ్ కాదు. ముఖ్యమంత్రిగా ఎక్కువ సంవత్సరాల పాటు పని చేసిన నేతగా ఏడు పదుల వయస్సులో కూడా సీఎంగా ఉన్న నేతగా చంద్రబాబుకు పేరుంది. రాజకీయంగా చంద్రబాబు నాయుడు సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. 1995 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన చంద్రబాబు తొలిసారి సీఎం పదవిని చేపట్టారు.
 
అయితే 2004 ఎన్నికల్లో మాత్రం టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల మనస్సులను గెలుచుకోవడంలో నూటికి నూరుశాతం సక్సెస్ అయ్యారు. 2004 ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణులను ఒకింత నిరాశకు గురి చేయడంతో పాటు షాక్ కు గురి చేశాయనే చెప్పాలి.
 
1995 నుంచి 2004 వరకు చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా పని చేసినా సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కాలేదని ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది ఉద్యోగులకు వ్యతిరేకంగా చంద్రబాబు వ్యవహరించిన తీరు సైతం ఆయనకు మైనస్ అయిందని చెప్పవచ్చు. 2009 సమయానికి టీడీపీ రాష్ట్రంలో పుంజుకున్నా వైఎస్సార్ క్రేజ్, పాపులారిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల 2009లో సైతం టీడీపీకి నిరాశే ఎదురైందని చెప్పవచ్చు.
 
అయితే వైఎస్సార్ మరణం తర్వాత టీడీపీకి ఒకింత అనుకూల పరిస్థితులు అయితే ఏర్పడ్డాయని చెప్పవచ్చు. 2014 సంవత్సరంలో టీడీపీ సులువుగానే అధికారంలోకి వచ్చింది. అయితే సంక్షేమాన్ని విస్మరించడం వల్ల ఆ సమయంలో ఆశించిన ఫలితాలు అయితే రాలేదనే చెప్పాలి. అయితే 2019లో టీడీపీ ఘోర పరాజయం పాలైనా జనసేన, బీజేపీలతో పొత్తు ద్వారా చంద్రబాబు 2024 ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని అయితే సాధించారు. చంద్రబాబు నాయుడు విజన్ ను ప్రజలు సైతం ఎంతగానో మెచ్చుకుంటున్నారు. నవ్యాంధ్ర ప్రదేశ్ బాబు పాలనలోనే అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుందని భావిస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: