* అమెరికాకు వెళ్లిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు
* 31 రోజుల సీఎంగా నాదెండ్ల
నాదెండ్లకు అదే స్థాయిలో ఎన్టీఆర్ ఎదురుదెబ్బ
రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది అట్టర్ ఫ్లాప్ అయ్యారు. చెన్నారెడ్డి నుంచి మొదలు పెడితే కేసీఆర్ వరకు...ఎన్టీఆర్ నుంచి మొదలుపెడితే జగన్... ఎంతోమంది రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా ఎదిగి.. చరిత్ర సృష్టించారు. అయితే కేవలం నెల అంటే నెల రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు కొనసాగారు.
అన్న నందమూరి తారక రామారావు కు వెన్నుపోటు పొడిచి మరి... నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రి కావడం జరిగింది. అయితే వెన్నుపోటు పొడిచినందుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడంతో మళ్ళీ నందమూరి తారక రామారావు.. ముఖ్యమంత్రి కావడం జరిగింది. 1984 సమయంలో... నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పటివరకు కాంగ్రెస్ నేతలే ఏపీని ఏలిన సంగతి తెలిసిందే.
కానీ బీసీలు, సామాజిక సేవ పేరుతో నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఈ పార్టీని పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి కూడా తీసుకురాగలిగారు నందమూరి తారక రామారావు. అయితే 1984లో... అనారోగ్య సమస్యల కారణంగా అమెరికాలోని టెస్లాకు... తన కుటుంబంతో నందమూరి తారకరామారావు వెళ్లడం జరిగింది. అయితే ఆయన అమెరికాకు వెళ్లడంతో.. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు... తెలుగుదేశం పార్టీలో చీలిక తీసుకువచ్చారు.
కాంగ్రెస్ నేతలతో కుమ్మక్కై.. కోవర్టు రాజకీయాలు చేశారు. అందరినీ ఏకం చేసి ముఖ్యమంత్రిగా 1984లో నాదెండ్ల భాస్కరరావు బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఏపీకి వచ్చిన నందమూరి తారక రామారావు, చంద్రబాబు ఇద్దరు కలిసి చాకచక్యంతో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు. ఆ సమయంలో 31 రోజులపాటు నాదెండ్ల భాస్కరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాదెండ్ల భాస్కరరావు కారణంగా మళ్ళీ కాంగ్రెస్ చిత్తుచిత్తుగా తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయింది. ఇలా నాదెండ్ల భాస్కరరావు తన కెరీర్లో పెద్ద మిస్టేక్ చేశారు.