1982 సంవత్సరం మార్చి నెల 29వ తేదీన కొత్త పార్టీ పెడుతున్నట్టు వెల్లడించిన సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. 1983 ఎన్నికల్లో తెలుగుదేశంకు అపూర్వ విజయం దక్కిందనే సంగతి తెలిసిందే. 1985లో ప్రజల తీర్పు కోరుతూ మధ్యంతర ఎన్నికలకు వెళ్లి సీనియర్ ఎన్టీఆర్ మళ్లీ సీఎం అయ్యారు. అయితే 1985లో సీఎం అయిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ కొన్ని తప్పులు చేశారు.
ఆ సమయంలో ప్రభుత్వంలో అన్నీ తానై నడిపించడం ఆయనకు మైనస్ అయింది. ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ పై ప్రజల్లో నిరసన భావం పెరిగింది. 1989 ఎన్నికలకు ముందు సీనియర్ ఎన్టీఆర్ కొత్త మంత్రుల్ని తీసుకోవడం, ఆ సమయంలో జరిగిన కుల ఘర్షణలు ఒకింత మైనస్ అయ్యాయి. సీనియర్ ఎన్టీఆర్ ఏకస్వామ్య పాలన ఆయనను ముంచేసిందని చెప్పవచ్చు.
అయితే సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా పని చేసిన సమయంలో అమలు చేసిన పథకాలు మాత్రం ప్రజల ప్రశంసలు పొందాయి. దాదాపుగా 45 సంవత్సరాల నుంచి ఈ పథకాలు అమలవుతున్నాయంటే ఎన్టీఆర్ ఎంత ముందుచూపుతో ఈ పథకాలను అమలు చేశారో అర్థమవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ పాలనలో తన మార్క్ ను చాటుకోవడంతో పాటు ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు. ఇప్పటికీ గొప్ప సీఎంలలో సీనియర్ ఎన్టీఆర్ పేరు ముందువరసలో ఉంటుంది. ఈ జనరేషన్ లో సైతం ఆయనను ఎంతోమంది అభిమానిస్తున్నారు.