- వైసిపి గ్రాఫ్ తగ్గి టిడిపి గ్రాఫ్ పెరిగిందా.?
- ఆ నేతలను నమ్మడమే జగన్ చేసిన తప్పా.?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వెరైటీగా ఉంటాయి. అక్కడ ఒకసారి గెలిచిన పార్టీ మరోసారి గెలవడం చాలా కష్టం. అలాంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో విడిపోయిన తర్వాత మొదటిసారి చంద్రబాబు సీఎం అయ్యారు. ఆయన పాలనలో అంతగా అభివృద్ధి జరగలేదని చెప్పేసి 2019 ఎన్నికల్లో మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి తీసుకువచ్చారు ప్రజలు. మొదటిసారి పరిపాలన విభాగంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం అద్భుతమైన పథకాలు తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల ఇంటి వద్దకే పథకాలు అందేలా చేశారు. ఈ విధంగా ఎన్నో అద్భుతమైనటువంటి దేశంలో లేనటువంటి పథకాలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో మాత్రం దారుణంగా ఓటమిపాలయ్యారు. దీనికి కొన్ని ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. జగన్ ఓటమికి కారణం జగనే అని కూడా చెప్పవచ్చు. అది ఎలాగో ఆ వివరాలు ఏంటో చూద్దాం..
చంద్రబాబు అరెస్టు జగన్ చేసిన తప్పా.?
ఎన్నో పథకాలు తీసుకొచ్చి పేద ప్రజల దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విషయంలో అద్భుతంగా పాలించారు. కానీ ఆయన కిందున్నటువంటి కొంతమంది మంత్రులు,ఎమ్మెల్యేలు, మండల స్థాయి నాయకులు ప్రజలతో అంతగా మింగిల్ కాలేకపోయారు. దీనికి తోడు వాలంటరీ వ్యవస్థ. ఈ వాలంటరీలు ఉండడం వల్ల గ్రామీణ స్థాయిలో ఉండేటువంటి కార్యకర్తలు కిందిస్థాయి నాయకులు ఎవరు కూడా ప్రజలతో ఇంట్రాక్ట్ కాలేకపోయారు. ఏ పథకం వచ్చినా ఏది వచ్చినా కానీ వాలంటీర్లే తీసుకెళ్లి ప్రజలకు ఇవ్వడం వల్ల అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆదరణ తగ్గిపోయింది. ఇక ఇదే కాకుండా కొంతమంది చోటామోటా లీడర్లు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులు పెట్టుకుంటూ వారే పెద్ద మంత్రులుగా ఫీల్ అయిపోయి మైనస్ అయ్యారు. దీనికి తోడు అరాచకాలు ఇసుక దందాలు భూ అక్రమణులు ఇలా అనేకం నడిచాయి. ఈ విషయాలన్నీ జగన్ వరకు చేరినా కానీ ఆయన ఎవరిపై కూడా యాక్షన్ తీసుకోలేకపోయారు. అంతా మనవాళ్లే కదా ప్రజలకు పథకాలు అందితే చాలు అనే అపోహలోనే ఉండిపోయారు. కింది స్థాయిలో అవుతున్న మైనస్ను గమనించలేకపోయారు.