* పీఆర్పిలో యువరాజ్య అధ్యక్షుడిగా రాజకీయ రంగప్రవేశం.!
* 2014 ఎన్నికలను ప్రభావితం చేసిన పవన్.!
* 2019 ఎన్నికల ఫలితాలలో ఒక్క సీటుకే పరిమతం.!
* 2024 ఎన్నికల్లో భీభత్సం సృష్టించిన పవన్.!


(ఆంధ్రప్రదేశ్-ఇండియాహెరాల్డ్ ): పవన్ కళ్యాణ్..అసలు పరిచయమే అవసరం లేని పేరు.రాష్ట్రంలోని యూత్లో ఆ పేరుకున్న క్రేజ్ మరెవరికి లేదనడంలో ఆశ్చర్యం లేదు.ఆయన తన అన్నయ్య చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా 2008లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు .పిఆర్పితో ఉన్న సమయంలో, కళ్యాణ్ ఎన్నికలలో పోటీ చేయలేదు లేదా ఏ రాజ్యాంగ పదవిని నిర్వహించలేదు, అయినప్పటికీ అతను పార్టీ కోసం చురుకుగా ప్రచారం చేశాడు.2011లో పిఆర్పిను కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పుడు కళ్యాణ్ మౌనంగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. తన సోదరుడి నిర్ణయంతో రాజకీయ జీవితం నుంచి విరామం తీసుకున్నాడు.ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినా తన సోదరుడు పార్టీని కొనసాగించాలని ఆయన కోరుకున్నట్లు తెల్సింది.అయితే అలా జరగకపోవడంతో 2014 మార్చిలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు.అతను 2014 ఎన్నికలలో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నప్పటికీ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ  ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలపై చర్చించడానికి మరియు తన మద్దతును అందించి టీడీపీ మరియు బీజేపీ కూటమికి మద్దతునిస్తూ విస్తృతంగా ప్రచారం చేశాడు.కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ 'కాంగ్రెస్ హటావో,దేశ్ బచావో 'అనే నినాదాన్ని ఇచ్చారు.అతని ర్యాలీలు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలలో భారీ సంఖ్యలో ప్రజలను ఆకర్షించాయి.అతని మద్దతు మరియు ప్రచారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో tdp నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాయి.తర్వాత అతను రాజకీయా పరిణామాల్లో వచ్చిన మార్పుల దృష్ట్యా ఉద్దానంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి సంక్షోభంపై జాతీయ దృష్టిని తీసుకువచ్చాడు, మరియు బలవంతపు భూసేకరణ, మరియు రిజర్వ్ చేయబడిన అడవులలో అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలకు నాయకత్వం వహించాడు.అయితే అప్పటికి ప్రజల్లో  రాజకీయా పరంగా పవన్ కళ్యాణ్ పై అంతగా నమ్మకం లేదు.వరుస పెళ్లిళ్లు ఎఫెక్ట్ కూడా ప్రజల్లో బాగా ఉంది.

అయితే 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జనసేన పార్టీ 140 నియోజకవర్గాల్లో పోటీ చేసింది.అందులో కళ్యాణ్ గాజువాక, భీమవరం రెండు నియోజకవర్గాల నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతిలో ఓడిపోయాడు. అయితే అతని పార్టీ అభ్యర్థి ఒక్క రాజోల్ నుండి మాత్రమే గెలిచి దాదాపు 6% ఓట్లను మాత్రమే సాధించింది.అయితే పవన్ కళ్యాణ్ ప్రసంగాలు యూత్ ను మాత్రమే ఆకట్టుకునేలా ఉంటాయి కానీ సామాన్య ప్రజలను దగ్గర చేసేవికావు.మరో వైవు ఆయన మీటింగ్ లో మాట్లాడే తీరులో స్థిరత్వం అనేది ఉండేది కాదు. ఏదో ఒక అంశంపై మాట్లాడుతా మాట్లాడుతా వేరే టాపిక్లోకి వెళ్ళేపోవడం అనేది చాలా సార్లు గమనించిన అంశం. ప్రధానంగా వైసీపీ ప్రతిసారి ఆయన వ్యక్తిగత జీవితంపై ఎక్కువగా ఫోకస్ చేయడం వల్లే ఆయనకు బాగా మైనస్ అయిందనే చెప్పాలి. మరీ ఇలాంటి అనేక కారణాలతో 2019 ఎన్నికల్లో బరిలోకి దిగిన పవన్ ను ప్రజలు బ్రహ్మరధం పడతారు అనుకుంటే ఆయన్ను కేవలం ఒక్క సీటుకే పరిమితం చేశారు.అసలే 2019 ఎన్నికల ముందు జగన్ పాదయాత్ర చేసి ప్రజల నమ్మకాన్ని ముటగట్టుకొని ఉన్న టైములో పవనే కాదు రాజకీయా మేధావి ఐనా చంద్రబాబు సైతం కూలిపోవడం అనేది జరిగింది.ఆవిధంగా జనసేన మరియు టీడీపీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్లో కొట్టుకుపోయాయి.ఆ తర్వాత పవన్ కూడా తన అన్నయ్య చిరంజీవి లాగా పార్టీని గాల్లో వదిలేస్తారని చాలా విమర్శలు ఎదురుకున్నారు.స్వాతహాగా కన్యూనిస్ట్ భావజాలానికి ప్రభావితం ఐనా పవన్ పార్టీని వదిలేయకుండా దాదాపు పదేళ్లు పోరాడి మరీ ప్రజల్లో తీసుకుపోయారు అనడానికి ఇటీవల జరిగిన ఎన్నికలే సాక్ష్యం.

అయితే 2019 ఎన్నికల తర్వాత కళ్యాణ్ మరియు JSP రైతు సంక్షేమం, అక్రమ ఇసుక మైనింగ్, మహిళల భద్రత మరియు భూ ఆక్రమణ వంటి అంశాలపై దృష్టి సారించింది.2022 చివరలో, కళ్యాణ్ 'జన వాణి'ని ప్రారంభించాడు, ప్రజల మనోవేదనలను వినడానికి చిన్న చిన్న బహిరంగ సభలు ఏర్పాటు చేశారు.2023లో ఓటర్లతో కనెక్ట్ కావడానికి తన అనుకూలీకరించిన వాహనం 'వారాహి'లో రాష్ట్రవ్యాప్త పర్యటనను ప్రారంభించాడు. 2024 ఎన్నికల్లో జేఎస్పీ, టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు పెట్టుకోవడంలో కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు.జనసేన పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు మరియు 2 ఎంపీ స్థానాల్లో ఒక్కొక్కటి గెలిచింది. కళ్యాణ్ పిటాపురం నియోజకవర్గం నుండి 70,000 ఓట్ల ఆధిక్యతతో ఎన్నికయ్యి ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా, వివిధ శాఖలకు మంత్రిగా వ్యవహారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: