తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో గొప్ప స్థాయికి ఎదిగిన నటులలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. ఈయన ఎవరి అండదండలు , బ్యాక్ గ్రౌండ్ లేకపోయిన తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చి ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ , ఒక్కో విజయాన్ని అందుకుంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయికి ఎదిగాడు. చిరంజీవితో పాటు ఎంతో మంది స్టార్ హీరోల కుమారులు ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా వారందరిని తట్టుకొని నిలబడి స్టార్ హీరోగా ఎదగడం మాత్రమే కాకుండా ఆ స్టార్ హీరో పొజిషన్ను చాలా రోజుల పాటు కూడా కాపాడుకున్నాడు.

తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ ఉన్న మాస్ హీరోగా సూపర్ ఈమేజ్ను సంపాదించుకున్న చిరంజీవి 2009 వ సంవత్సరం ఎలక్షన్లకు ముందు ప్రజారాజ్యం అనే రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికి చిరంజీవికి సినిమాల్లో అద్భుతమైన క్రేజ్ ఉండడం , ఎంతో మంది అభిమానులు ఉండడం వల్ల ఈయన పార్టీ పెట్టిన తక్కువ కాలంలోనే ప్రజారాజ్యం పార్టీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత చాలా తక్కువ కాలంలోనే ఎన్నికలు రావడంతో చిరంజీవి ప్రచారాలు చేయడానికి కూడా ఎక్కువ సమయం లేకుండా పోయింది. అయినప్పటికీ ఈ పార్టీ మంచి ఇంపాక్ట్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూపిస్తుంది అని చాలా మంది భావించారు. కానీ రిజల్ట్ ఆ స్థాయిలో రాలేదు.

ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ గాలి భారీగా వీస్తుండడం , తెలుగుదేశం పార్టీ కూడా ప్రజారాజ్యం పార్టీకి గట్టి పోటీ ఇవ్వడంతో ప్రజారాజ్యం పార్టీ పెద్ద స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఇక ఆ తర్వాత చిరంజీవి పార్టీని అలాగే కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించి ఉంటే ఈయన ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగే నాయకుడు అని చాలా మంది అభిప్రాయపడ్డా కూడా చిరంజీవి 2009 ఎలక్షన్ల తర్వాత కొంత కాలానికే తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే మంత్ర పదవిని తీసుకున్నాడు.

ఆ తర్వాత కూడా చిరంజీవి రాజకీయాలలో ఎక్కువ కాలం కొనసాగలేదు. కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి రాజకీయాలకు దాదాపుగా స్వస్తి చెప్పేసి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసాడు. చిరంజీవి 2009 ఎలక్షన్ల అనంతరం తను స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయకుండా మరో కొన్ని అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల వరకు పార్టీని కొనసాగించి ఉండుంటే చిరంజీవి రాజకీయాల్లో సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేవాడు అని కొంత మంది అభిప్రాయపడ్డ వారు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: