- మరపురాని పాలన అందించిన చెన్నారెడ్డి..
- ఆయనను తట్టుకోలేక వెనుక నుంచి వెన్నుపోటు..
- సొంత పార్టీ నేతలే గద్దె దించారా.?


 ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలను పాలించిన సీఎంల పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది అలనాటి ఎన్టీఆర్ తర్వాత చాలామందికి సుపరిచితుడు మర్రి చెన్నారెడ్డి మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన, నాలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా పనిచేసిన ఘనత చెన్నారెడ్డిది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో పథకాలు, పేద ప్రజల కోసం ఎన్నో త్యాగాలు, చేశారు. అలాంటి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమ సేనానిగా గొప్ప పరిపాలన దక్షకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. అలాంటి చెన్నారెడ్డి రాజకీయ జీవితంలో సొంత  పార్టీ నేతల వల్లే పతనమైపోయారు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

 రాజకీయ పతనం:
 1978, 1989లో  కాంగ్రెస్ పార్టీని ఏకధాటిగా అధికారంలోకి తీసుకువచ్చిన చెన్నారెడ్డి  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయనకు పదవులతో పాటు ఎన్నో వివాదాలు వెన్నంటే ఉండేవి. ఆ టైంలోనే ట్రబుల్ షూటర్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు. ఐదు దశాబ్దాల పాటు రాజకీయ జీవితంలో ఉన్న ఆయన రెండు సార్లు సీఎంగా, పనిచేసి నెహ్రూ, ఇందిరా గాంధీలకు ఎంతో ఆప్తుడిగా మారారు. అంతేకాకుండా నాలుగు కీలకమైన రాష్ట్రాలకు గవర్నర్ గా కూడా సేవలందించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నిత్య తిరుగుబాటు దారుడిగా పేరు తెచ్చుకున్నారు. చివరికి కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఒకానొక సమయంలో ప్రజా ఫ్రంట్   పేరుతో పార్టీ కూడా స్థాపించారు. ఈ విధంగా తొలి తరం తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుతలుగించాడు మర్రి చెన్నారెడ్డి. ఆ తర్వాత రాజకీయ పరిణామాలు దృష్ట్యా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. 1971లో ఆరు సూత్రాలు అమలు కమిటీలో కీలక పాత్ర పోషించారు. ఇంతటి ఘనత సాధించిన చెన్నారెడ్డిని సొంత పార్టీ నేతలే పదవికి రాజీనామా చేసి  బయటకు వచ్చేలా చేశారని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయట.


1990లో హైదరాబాదులో జరిగినటువంటి మత ఘర్షణలే మర్రి చెన్నారెడ్డి పతనానికి కారణమయ్యాయి. ఎన్టీఆర్ ను ఎన్నికల్లో ఓడించి చెన్నారెడ్డి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. అప్పటికే ఆ సీట్ పై కన్నేసినటువంటి చెన్నారెడ్డి వ్యతిరేకవర్గం దారుణాలకు ఒడిగట్టిందట. చెన్నారెడ్డి పాలనలో విఫలమయ్యాడని అధిష్టానానికి చెప్పడం కోసం హైదరాబాదులో మత ఘర్షణలు సృష్టించారట. దీంతో అన్నదమ్ముల్లా కలిసి ఉండే హిందూ, ముస్లిం మధ్య చిచ్చుపెట్టి  ఒకరినొకరు కొట్టుకునేలాగా చేసి దాదాపు 300 మంది చావుకు కారకులయ్యారు. వందలాదిమంది గాయాలతో ఇబ్బందులు పడ్డారు. ఈ అల్లర్లు జరిగిన తర్వాత పార్టీ నుంచి కొంత మంది ఎమ్మెల్యేల హస్తము ఉందని ఆయన డైరెక్ట్ గా ప్రకటించారు. హైదరాబాదుకు చెందినటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత  రౌడీ మూకలకు ఆశ్రయం ఇచ్చారని ఆయన అన్నారు. ఈ విధంగా నా ఒక్క పదవి కోసం ఇంతమందిని పొట్టన పెట్టుకోవడంపై చెన్నారెడ్డి చలించి పోయారు. దీంతో చెన్నారెడ్డి 1990 డిసెంబర్ 13న పదవికి రాజీనామా చేశారు. ఆయన తర్వాత నేదురు మల్లి జనార్దన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: