ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తానని ప్రకటన చేసిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్‌ కామెంట్స్ చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ రాజీనామా చేస్తే.. కేసీఆర్‌ కుటుంబంలో ఒకరికి ఆ పదవి వస్తుందని బాంబ్‌ పేల్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఢిల్లీ లిక్కర్‌ స్కాం లో ఇరుక్కున్న కవితకు ఆ పదవి దక్కుతుందని పరోక్షంగా పేర్కొన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.


గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. హిందువుల పండుగులకే ఆంక్షలు,నిబంధనలు ఎందుకు? అని ప్రశ్నించారు. సెప్టెంబరు 17 నరేంద్ర మోడి పుట్టినరోజు దేశవ్యాప్తంగా సేవా కార్య క్రమాలలో పాలుపంచుకోవాలని స్పష్టం చేశారు. సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవం... తెలంగాణ కి స్వాతంత్ర్యం వచ్చినరోజు అని తెలిపారు కేంద్ర మంత్రి బండి సంజయ్.

రజాకార్ల అరచకాలని మనం ఎప్పుడూ మరిచిపోలేమన్నారు. బీఆర్‌ఎస్ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం ని మరిచిపోయిందని ఆగ్రహించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపడం లేదని తెలిపారు. ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ లు భయపడి సెప్టెంబరు 17 ని జరుపడం లేదని మండిపడ్డారు. వీరుల బలిదానాలని ,త్యాగాలని బీఆర్ఎస్, కాంగ్రెస్ లు మరిచిపోయాయని ఫైర్‌ అయ్యారు.


తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం కాదు... తెలంగాణ ప్రజా వంచన దినోత్సవం జరుపుకోండని చురకలు అంటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్, బీఆర్ఎస్ లది అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట...లేనప్పుడు మరోమాట అని విమర్శలు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తే మేమూ భాగస్వాములమవుతామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్.  తెలంగాణ ప్రజలను హింసించిన రజకార్ల పార్టీతో అంటకాగుతారా? జై పాకిస్తాన్, జై పాలస్తీనా అని నినదించిన ఒవైసీని పొగుడుతారా? అని ఆగ్రహించారు. ఇకనైనా రేవంత్‌ రెడ్డి మారాలని కోరారు. లేకపోతే.. కేసీఆర్‌ లాగే ఇంటికి వెళతాడన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: