* పసుపు రైతుల కారణంగా ఓడిన కవిత
* పసుపు బోర్డు ప్రకటనతో ఎంపీ అరవింద్ సక్సెస్
* క్వింటాలుకు పదివేల రూపాయలు ఉండాలని డిమాండ్


 
మన రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక రకాల పంటలు పండుతున్నాయి. ఒక్కో జిల్లాలో ఒక్కో రకం పంట.. పండడం జరుగుతుంది. ఏ జిల్లా ప్రత్యేకత ఆ జిల్లాకే ఉంటుంది. అయితే.  పసుపు.. పేరు చెప్పగానే అందరికీ నిజామాబాద్ జిల్లా పేరు గుర్తుకు వస్తుంది. అంతేకాదు ఈ పంట పేరు చెప్పగానే ఎంపీ అరవింద్ అలాగే కల్వకుంట్ల కవిత పేరు కూడా... అందరూ గుర్తు తెచ్చుకుంటారు. ఈ పసుపు పంట కారణంగా గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత ఓడిపోవడం జరిగింది.


2014 సంవత్సరం ఎన్నికల్లో.. కల్వకుంట్ల కవిత.. నిజామాబాద్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. అయితే ఆమె గెలిచిన తర్వాత పసుపు బోర్డు ఏర్పాటు పై పెద్దగా... ఫోకస్ చేయలేదని వార్తలు వచ్చాయి.  దీంతో 2019 పార్లమెంట్ ఎన్నికల్లో...  ఆమెకు వ్యతిరేకంగా దాదాపు 174 మంది పసుపు రైతులు నామినేషన్ వేశారు.  అదే సమయంలో పసుపు బోర్డుపై బాండ్ పేపర్... రాసి ఇచ్చి.. ధర్మపురి  అరవింద్  హామీ ఇచ్చారు.

 
ఇక ఈ దెబ్బకు... కల్వకుంట్ల కవిత పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. అయితే.. ఎన్నికల్లో గెలిచిన తర్వాత.... చాలా కష్టపడి ప్రధాని నరేంద్ర మోడీతో పసుపు బోర్డు పై ప్రకటన చేయించారు. పసుపు బోర్డు లేకపోయినా.. దానికి సమానమైన ఒక.. సిస్టంను అరవిందు ఏర్పాటు చేయడం జరిగింది. అయినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో పసుపు రైతుల సమస్యలు తీరడం లేదని చెబుతున్నారు.

 
వాస్తవంగా క్వింటాలుకు.. పదివేల రూపాయల చొప్పున  పసుపు కొనుగోళ్లు జరగాలి. కానీ ప్రస్తుతం.. పసుపు క్వింటాలుకు 6000 రూపాయలు మాత్రమే పలుకుతోందని కొంతమంది రైతులు ఆందోళన చెందుతున్నారు. అప్పుడప్పుడు క్వింటాల్ 4వేల రూపాయలు మాత్రమే లభిస్తోందని చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లా అలాగే కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల, ఆర్మూర్ లాంటి ప్రాంతాలలో ఈ పసుపు రైతులెక్కువగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: