కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ విద్యా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.. దీంతో ప్రభుత్వ పాఠశాలల పైన ఎక్కువ దృష్టి పెట్టి విద్యార్థులకు ఉపాధ్యాయులకు సరికొత్త సూచనలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. గతంలో వైసిపి ప్రభుత్వం అమలు చేసిన CBSE పద్ధతిని రద్దు చేసినట్లు తెలుస్తోంది. పేదలకు వ్యతిరేకంగా నారా లోకేష్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే విధంగా వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ పైన ఫైర్ అయ్యారు. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అయిన అందించడంలో కూటమి ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న లోకేష్ తిరగోమన నిర్ణయాలతో పిల్లలను, స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకువచ్చేలా చేస్తున్నారంటూ ఆరోపించారు.


మీ ఇళ్లలోని పిల్లలకు కూడా ఇలాంటి అత్యుత్తమ చదువు అందిస్తూ ఉన్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్ పిల్లల విషయంలో ఇలాంటి వివక్ష ఎందుకు అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూళ్ల రూపురేఖలను సైతం మార్చేటువంటి కార్యక్రమాలను కూడ రద్దు చేస్తున్నారు. ఇది ఎంతవరకు సరైనదో అంటూ ప్రశ్నించారు. మీ ముఖ్యమంత్రి 14 ఏళ్ళు చేయలేని పనులను ఐదేళ్లలో చేసి చూపించాము అంటూ తెలిపారు జగన్.


అలాగే నాడు నేడు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్  ఇలా ఎన్నో వాటిని తీసుకువచ్చాము. కానీ మీరు పేద పిల్లల తలరాతన మార్చేందుకు అంగీకరించలేదు.. ఒక్కొక్కటిగా రద్దు చేస్తున్నారంటు వైయస్ జగన్ తెలిపారు. గవర్నమెంట్ స్కూల్ ను మూసేసి ప్రైవేట్ బాట పట్టించేందుకే ఇలా చేస్తున్నారు లోకేష్ చంద్రబాబు అంటూ జగన్ ఆరోపించారు..


వైయస్ జగన్ చేసిన ట్వీట్ కు సైతం మంత్రి నారా లోకేష్ ఇలా కౌంటర్ వేస్తూ.. ఏం చదివారో తెలియదు ఎక్కడ చదువుకున్నారో తెలియదు మీరు విద్యాశాఖ గురించి ఇలా మాట్లాడడం వింతగా ఉంది కనీస అవగాహన లేకుండ ఉన్నారు..రాత్రి మాట్లాడి మీరు ఉదయం నిర్ణయం తీసుకుని వెయ్యి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారారంటూ తెలిపారు..CBSC  విధానంలో పరీక్షలు రాయడానికి అవసరమైనటువంటి సామర్థ్యం లేదు, అలాగే ఉపాధ్యాయులకు కూడా ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే చేస్తున్నారు. పదవ తరగతి చదువుతున్న 75 వేల మంది విద్యార్థుల భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకంగా మార్చారంటూ లోకేష్ సెటైర్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: