రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎక్కువగా సాగు చేసే వాణిజ్య పంటలలో ప్రత్తి పంట ఒకటి. కర్నూలులోని ఆదోని, పరిసర ప్రాంతాలలో ప్రత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తారు. మూడేళ్ల క్రితం వేసవికాలంలో క్వింటా ప్రత్తి ధర 14000 రూపాయలకు పెరగగా ఆ తర్వాత రోజుల్లో క్వింటా 8000 రూపాయలకు తగ్గి ప్రస్తుతం అదే ధర కొనసాగుతోంది. వాస్తవానికి ఇతర పంటలతో పోల్చి చూస్తే ప్రత్తి పంట సాగుకు ఖర్చు ఎక్కువ అవుతుంది.
 
అదే సమయంలో నాసిరకం విత్తనాల వల్ల, ఊరూ పేరు తెలియని కంపెనీల విత్తనాల వల్ల నష్టపోతున్న రైతులు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గులాబీ రంగు పురుగు వల్ల ప్రత్తి రైతులకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతోంది. ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకుండా పోతుందని కొంతమంది రైతులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.
 
ఈ ఏడాది భారీ వర్షాల వల్ల ప్రత్తి పంటలో నష్టాలు వచ్చిన రైతులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. ఆ రైతులను ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ప్రత్తి రైతుల ఆవేదన అంతాఇంతా కాదని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రత్తి రైతులకు మేలు జరిగేలా అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవైనా చర్యలు చేపడతాయేమో చూడాలి.
 
ప్రత్తి పంట సాంగు అంతకంతకూ పెరిగేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు చేపట్టడంతో పాటు మార్కెట్ లోకి నాసిరకం విత్తనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. గతంతో పోల్చి చూస్తే కూలీల రేట్లు సైతం భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వైపు నుంచి పూర్తిస్థాయిలో సపోర్ట్ లేకపోతే రైతులకు ఇబ్బందులు తప్పవనే కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రత్తి రైతుల విషయంలో ప్రభుత్వం తీరు ఎలా ఉంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: