* టమాటా పంటకు ఎన్నడూ లేని విధంగా ఊహించని గిరాకీ
* కిలో 10 రూపాయలు నుండి 100 రూపాయలకు ఎగబాకిన టమాటా ధర
* స్థిరంగా లేని టమాటా ధరని నమ్ముకుని అప్పులపాలవుతున్న రైతులు
ఆంధ్రప్రదేశ్ లో టమాటా పంటకు ఎప్పుడు ఎలాంటి గిరాకీ ఉంటుందో చెప్పలేని పరిస్థితి.. టమాటా పంటను ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో సాగు చేస్తుంటారు.టమాటా పంటకు ఒక్కోసారి అస్సలు గిరాకీ ఉండదు కిలో రూ.10 నుండి రూ 15 వరకు ఉండేది.. ఈ రేట్లతో టమాటా రైతులకు అస్సలు గిట్టుబాటు అయ్యేది కాదు.. దీనితో రైతులు టమాటా పంటను పండించడం తగ్గించివేశారు..టమాటా పంట తగ్గేసరికి దేశ వ్యాప్తంగా టమాటా పంటకు ఊహించని గిరాకీ వచ్చి పడింది.. కిలో రూ 100 నుండి రూ. 150 వున్న రోజులు కూడా వున్నాయి.. టమాటా ధరలు అనూహ్యంగా పెరగడంతో కోటీశ్వరులైన రైతులు కూడా వున్నారు.. పెరిగిన ధరనే నమ్ముకుని క్వింటాలు, క్వింటాలు కొని తీవ్రంగా నష్టపోయిన రైతులు కూడా వున్నారు..