* తెలుగు రాష్ట్రాల్లో చెరకు రైతులకు ఇబ్బందులు

* ఫ్యాక్టరీలకు తాళాలు వేయడంతో రైతన్నలకు అదనపు భారం

* సమస్యలతో రైతన్నలకు తీవ్ర నష్టాలు  

( ఏపీ, తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

ఒకప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరి తరువాత అత్యధిక విస్తీర్ణంలో చెరకు పంటే పండేది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీస్ అన్నీ మూతపడుతున్నాయి. ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారమైన బోధన్ నిజాం షుగర్స్‌ ఉండేది. అయితే దానిని క్లోజ్ చేశారు. జగిత్యాల జిల్లా ముత్యంపేట, లక్ష్మీపూర్ లో నిజాం షుగర్స్ ఆధ్వర్యంలో ఉన్న మూడు షుగర్ ఫ్యాక్టరీలను కూడా బీఆర్‌ఎస్‌ నాయకులు మూసేశారు. దీని ఫలితంగా రైతులు చెరకును అమ్మేందుకు సుదూరప్రాంతాల్లో ఉన్న ప్రైవేటు షుగర్ ఫ్యాక్టరీలకు పోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.

ఇది చాలా సమయంతో కూడుకున్న పని అని చెప్పుకోవచ్చు. దీనివల్ల చెరకు గడ్డలు ఎండిపోయి అవి తూకం సమయంలో తక్కువ బరువు ఉంటున్నాయి. రవాణా ఖర్చులు కూడా రైతులకు షాక్‌లు ఇస్తున్నాయి. ఈ సమస్యల కారణంగా రైతన్నలు మూసేసిన ఫ్యాక్టరీలను తెరవాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పోయాక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చెరకు రైతన్నలలో ఆశలు చిగురించాయి. నిజాం చక్కెర ఫ్యాక్టరీని తిరిగి తెరుస్తామని కాంగ్రెస్ పార్టీ మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు.

ఇక గుంటూరు జిల్లా వేమూరులో ఉన్న జంపని, హనుమాన్ జంక్షన్ షుగర్ ఫ్యాక్టరీ, భీమడోలు, తాండవ, ఏటికొప్పొక, తుమ్మపాల, గోవాడ షుగర్ ఫ్యాక్టరీలకు కూడా తాళాలు వేశారు. వీటిని మళ్లీ తెరవక చెరకు సాగు విస్తీర్ణం మరింత తగ్గిపోతుంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తుమ్మపాల షుగర్స్‌ను క్లోజ్ చేసింది. ఫలితంగా మూడు ఫ్యాక్టరీల పరిధిలో చెరకు సాగు చేసే రైతుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ఫ్యాక్టరీలను క్లోజ్ చేయడం వల్ల పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తిరిగి రావడం లేదు మద్దతు ధర లేక తెలుగు రాష్ట్రాల్లో చెరకు పంటలు చాలా నష్టాల్లో ఉన్నాయి.చెరకు బకాయిల బిల్లులు పే చేయడంలో కూడా షుగర్‌ ఫ్యాక్టరీలు చాలా జాప్యం చేస్తున్నాయి దీనివల్ల ఈ పంటలు సాగు చేయడానికి రైతులు భయపడిపోతున్నారు వేరే పంటల వైపు మళ్లుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: