తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో కూడా వ్యవసాయం పైన ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తున్న ఎక్కువ శాతం మంది మాత్రం వరి , పత్తి లాంటి పంటలపైనే ఎక్కువ దృష్టిని పెడుతున్నారు. దానితో రెండు రాష్ట్రాలలో అత్యంత ఎక్కువ సాగు భూమిలో వరి , పత్తి మరికొన్ని పంటలను మాత్రమే పండిస్తున్నారు. ఇక కొంత మంది మాత్రమే ఈ పంటలను కాకుండా కొన్ని ఇతర పంటల వైపు దృష్టిని పెడుతున్నారు. అందులో చెరుకు , మిర్చి , మామిడి , పొగాకు , పామ్ ఆయిల్ , కూరగాయలు మరికొన్ని పంటలపై ఆసక్తిని చూపిస్తున్నారు.

ఇకపోతే తెలుగు రాష్ట్రాల వాతావరణానికి అద్భుతంగా సహకరించే పంటలలో పొగాకు ఒకటి. పొగాకు నుండి ఎక్కువ శాతం బీడీలు , సిగరెట్లు తయారు చేస్తారు. వీటికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన మార్కెట్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ కలిగిన పొగాకు పంట రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణానికి అద్భుతమైన స్థాయిలో సహకరిస్తూ ఉంటుంది. అలాగే రైతుకు ఈ పంట ద్వారా దిగబడి కూడా ఎక్కువ వచ్చే అవకాశం చాలా వరకు ఉంది. ఇంత గొప్పగా రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణానికి పొగాకు సహకరించిన కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పంట సాగు చేస్తున్న విస్తీర్ణం చాలా తక్కువగానే ఉంది.

దానికి ప్రధాన కారణం పొగాకును పండించడానికి రైతులు కాస్త ఆసక్తిని చూపిస్తున్నప్పటికీ దాని అమ్మే విషయంలో ఏ మాత్రం ఇబ్బందులు లేకుండా చేసి , రైతులందరికీ పొగాకు పండించడంపై అవగాహనను మరింతగా పెంచి , అలాగే వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించి వారు అమ్ముకోవడానికి మార్కెట్లను సృష్టించినట్లు అయితే పొగాకు పంటను ఎక్కువ ఉత్పత్తి చేయడానికి మరింత మంది రైతులు ముందుకు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: