•గిట్టుబాటు ధర లేకపోవడమే ప్రధాన కారణమా..

•వర్షాల మీద ఆధారపడుతున్న రైతులు

•అనంతపురంలో వేరుశనగ సాగు కష్టమేనా..

( ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్)
అనంతపురం అనగానే ముందుగా మనకు గుర్తొచ్చే ప్రధాన పంట వేరుశనగ. ఖరీఫ్ సీజన్లో వరి తర్వాత అధికంగా పండించే పంట ఇది.  అయితే ప్రస్తుతం ఉన్న పలు కారణాలవల్ల రైతులు వేరుశనగ సాగుపై అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. విత్తనాలు ధరలు పెరిగినప్పటికీ,  రైతులు పంట పండించి వాటిని అమ్మేటప్పుడు సరైన గిట్టుబాటు ధర రాక నష్టపోతున్నారు. ముఖ్యంగా సాగుకు ఎంతో ఖర్చు అవుతుంది. విత్తు నాటడం మొదలుకొని కలుపు, ఎరువులు , పంట చేతికి వచ్చినప్పుడు ఇలా ఎన్నో ఖర్చులు ఉంటాయి. వీటన్నింటికీ కూడా చాలామంది రైతులు అప్పు తెచ్చి మరీ పెడతారు. అయితే పంట చేతికి వచ్చిన తర్వాత సరైన ధర లభించక పూర్తిస్థాయిలో రైతులు నష్టపోతున్నారు.

కదా రెండేళ్ల క్రితం ఖరీఫ్లో 18.25 లక్షల ఎకరాల్లో వేరుశనగ పండించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనాలు వేసినా  అంతకుముందు ఏడాది 18.02 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ కూడా కేవలం 14 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు ప్రారంభం జరిగింది. అయితే సాగు ప్రారంభించారు కానీ రైతులు పూర్తిగా నష్టపోతున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత తగ్గుతూ వచ్చింది. ఒకప్పుడు 18 లక్షల ఎకరాలలో సాగుచేసిన రైతులు ఇప్పుడు ఏడు లక్షల ఎకరాల్లో కూడా సాగు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. దీనికి తోడు రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలను కూడా రైతులు పూర్తిస్థాయిలో తీసుకోలేదని చెప్పాలి. సుమారు 30 వేల క్వింటాళ్ల విత్తనాల నిలువలు ఆర్బికేలోనే ఉండిపోయాయి.


చాలావరకు అనంతపురం కరువు జిల్లాగా పేరు తెచ్చుకుంది. ఇక్కడ వర్షపాతం మీద రైతులు ఆధారపడి ఉన్నారు. మాగాని కంటే మెట్ట సాగు చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వర్షాలను ఆధారం చేసుకుని పంటలు పండించాల్సి ఉంటుంది.  ఇలా సకాలంలో వర్షాలు పడక,  పంట సరిగ్గా పండగ, పండిన పంటకు  సరైన గిట్టుబాటు ధరలు లేక ఎరువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో వేరుశనగ సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపించడం లేదు. ఇక రైతులు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లభించిందంటే సాగు చేయడానికి ఇబ్బంది ఉండదు కాకపోతే రాను రాను జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే అనంతపురంలో వేరుశనగ పంట ఇక కనుమరుగవుందేమో అనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: