ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ ఇప్పుడు రాజకీయాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత... పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ... కేసులు పెట్టడం జరుగుతోంది. వైసీపీ పార్టీలో ఉన్న కీలక నేతలందరూ.. దారుణంగా ఓడిపోయినప్పటికీ... పెద్దిరెడ్డి అలాగే ఆయన కుమారుడు మిథున్ రెడ్డి మాత్రం మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

 
పుంగనూరు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించడం జరిగింది. అదే సమయంలో పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ముచ్చటగా మూడోసారి విజయం సాధించడం జరిగింది. అయితే తాజాగా  వైసిపి పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళల రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజన అంశాల పైన ఆయన స్పందించారు. అయితే వీటి నేపథ్యంలో పుంగనూరు నియోజకవర్గం రెండుగా చీలి అవకాశాలు ఉన్నాయని.. వార్తలు వస్తున్నాయి.


దీనిపై ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ... పునర్విభజనలో భాగంగా పుంగనూరు రెండు నియోజకవర్గాలుగా చీలితే... ఒక నియోజకవర్గం నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ప్రకటించారు మిథున్ రెడ్డి. తన తండ్రి పెద్దిరెడ్డి మరొక నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటారని వివరించారు.  మొత్తానికి పుంగనూరు ను వదిలేది లేదని స్పష్టం చేశారు.  తాను ఎంపీగా పోటీ చేయబోనని కూడా వివరించారు.

 
తామెప్పుడు పుంగనూరు అభివృద్ధి కోసమే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మిథున్ రెడ్డి. ఇక వర్క్ఫ్ బిల్లు పైన కూడా స్పందించారు మిథున్ రెడ్డి. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకువచ్చారని... ఇందులోని అంశాలు మొత్తం మైనారిటీలకు వ్యతిరేకంగా ఉందని ఫైర్ అయ్యారు మిథున్ రెడ్డి. మొదటి నుంచి ఈ బిల్లుకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ వ్యవహరిస్తుందని కూడా తెలిపారు. కానీ కూటమి మాత్రం ఈ బిల్లును సమర్థించడం దారుణం అని మండిపడ్డారు. కాబట్టి మైనారిటీ సోదరులు ఈ విషయాలను గమనించాలి అని కూడా ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: