అప్పుడెప్పుడో 2002లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటివరకు తెరుచుకోలేదు. ఇక ఆ సమయంలో భారీగా నష్టాలు రావడంతో కనీసం ఎలాంటి టెండర్ కూడా వేయకుండానే అతి తక్కువ ధరకే ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీలను ప్రైవేట్ పరం చేశాడు చంద్రబాబు. ఎన్నో దశాబ్దాల చరిత్ర కలిగిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇక ఆ తర్వాత కూడా నష్టాలు చవి చూడటంతో పూర్తిగా మూత పడింది. దీంతో చెరుకు రైతు ఆగమైపోయాడు.
నిజామాబాద్, జహీరాబాద్ ప్రాంతాలలో ప్రధాన పంటగా ఉన్న చెరుకును అక్కడ రైతులు ఎక్కువగా పండిస్తూ ఉంటారు దీంతో నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడటంతో ఇక పండించిన పంటను ఏకంగా ఇతర రాష్ట్రాలకు తరలించాల్సిన పరిస్థితి అటు రైతులకు ఏర్పడింది. అయితే నిజం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేపట్టి మళ్లీ.. ఒకప్పటి పూర్వ వైభవాన్ని తీసుకువస్తుంది అని అటు కాంగ్రెస్ ప్రభుత్వం పై చెరుకు రైతులందరూ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే రేవంత్ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్న.. పూర్తిస్థాయిలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించి పూర్వవైభవాన్ని తీసుకువచ్చే చర్యలు మాత్రం చేపట్టకపోవడంతో చెరుకు రైతులందరూ మరింత ఆందోళన చెందుతూ ఉన్నారు అని చెప్పాలి.