‘తల్లికి వందనం’ పథకాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం అస్సలు అమలు చేయలేదని, అస్సలు అలాంటి ఓ పధకం అనేది ఒకటుందని కూడా మరిచారు అంటూ వైఎస్‌ జగన్‌ టీడీపీ పైన నిప్పులు చెరిగిన సంగతి అందరికీ తెలిసినదే. అయితే ఈ విషయంలో టీడీపీ కూటమి జగన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చి పడేసింది. ఆ విషయంలోకి వెళ్లేముందు జగన్ రెడ్డి వ్యాఖలు గురించి ఒకసారి పరిశీలిస్తే... గుంటూరు జైలు వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నీకు పదైదు వేలు.. నీకు పదైదు వేలు’’ అంటూ టీడీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల వేళ చేసిన ప్రచారంలోని కొన్ని మాటలను ఉదహరిస్తూ వాటికి హాస్యం జోడించి వ్యంగ్యంగా జగన్ రెడ్డిపైన విమర్శలు చేయడం జరిగింది.

విషయం ఏమిటంటే... జగన్‌ అధికారంలోకి వచ్చినప్పుడు అమ్మఒడి పథకాన్ని అమలు చేయడంలో ఎంత జాప్యం చుపించారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం ఆగమేఘాలపై అమలుచేసి తీరాలని జగన్ రెడ్డి కోరుతుండడం చాలా అవివేకం అని విమర్శలు చేసారు. అప్పటి ప్రభుత్వం 8 నెలలు తరువాత అమ్మఒడి నగదు విడుదల చేసిన సంగతి రాష్ట్ర ప్రజలకు బాగా గుర్తుంది అంటూ ఎద్దేవా చేసారు. అది కూడా సంక్రాంతి పండగ సమయంలో ప్రజలకు ఈ నగదు ఉపయోగపడుతుందనే కోణంలో ఇస్తున్నట్లు అప్పట్లో వైసీపీ నేతలు డబ్బా కొట్టిన సంగతి ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసారు.

విద్యా సంవత్సరం మొన్నమొన్ననే ప్రారంభమైనందున కొంత గడువు తర్వాత నిధులు విడుదల చేయాలని కూటమి ప్రభుతం యోచిస్తుండగా వరదల హడావుడి వచ్చి పడిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు మంత్రి. తల్లికి వందనం పథకం అమలుకు గతంతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు నిధులు ఇపుడు అవసరం. గత ప్రభుత్వం పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా, తల్లుల సంఖ్యనే పరిగణనలోకి తీసుకుని అమ్మఒడి అమలు చేసింది. కానీ ఇపుడు పరిస్థితి మారింది. ఇప్పుడు పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు దాదాపుగా 75 లక్షల మందికి ఈ పథకం కింద నిధులు ఇవ్వాలి. అందువల్ల నిధుల సమీకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది... అంటూ చిట్టా విప్పుకొచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: