ఇటీవల తెలంగాణలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి.గత వారం రోజుల నుంచి తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేేతల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికేపూడి గాంధీ మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్లతో అట్టుడికిపోయింది. కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ తన అనుచరులతో వెళ్లడం దుమారం రేపింది. మరోవైపు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తనపై దాడులు చేయిస్తుందని ఆరోపణు చేయడం, బీఆర్ఎస్ నేతలను హౌజ్ అరెస్ట్ చేయడం జరగడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి సమయంలో సీఎం ఇంటి వద్ద అనుమానాస్పదంగా బ్యాక్ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా సెలబ్రెటీలు, రాజకీయ, బడా వ్యాపారుల ఇంటివద్ద హై సెక్యూరిటీ ఉంటుంది. కొన్నిసార్లు ఎంత హై సెక్యూరిటీ ఉన్నా డొల్లతనాలు బయటపడుతూనే ఉంటాయి. మరవైపు కొంతమంది అగంతకులు పోలీసులకు ఫోన్ చేసి బాంబు బెదిరింపులకు పాల్పపడుతున్న సంఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. దాంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్ హడావుడి మొదలవుతుంది. తీరా స్పాట్ కి వెళ్లిన తర్వాం ఏమీ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వద్ద బ్యాగ్ కలకలం రేపిన సంగతి తెలిసిందే.జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి సమీపంలో అనుామానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ దాన్ని స్వాధీనం చేసుకుంది. అక్కడ్నుంచి మరో ప్రాంతానికి తరలించి తనిఖీ చేస్తున్నారు.ఆ బ్యాగ్‌లో ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఆ బ్యాగ్ ఎవరు అక్కడ పెట్టారనేదానిపై దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. సీఎం ఇంటి వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను పోలీసులు త‌నిఖీలు చేస్తున్నారు. ఆ ప‌రిస‌ర ప్రాంతాల‌ను పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ నివాసం వద్ద కలకలం రేపిన బ్యాగ్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. అందులో డమ్మీ బాంబు ఉన్నట్లు గుర్తించారు. సినిమా షూటింగ్ కోసం దీన్ని తయారు చేసిన ఓ వ్యక్తి తన బైక్ డిక్కీలో పెట్టాడు. అయితే ఆ బైక్ ను తీసుకెళ్లిన అతని ఫ్రెండ్ డిక్కీలో నిజమైన బాంబు ఉందనుకొని తెలియకుండా రేవంత్ నివాసం సమీపంలో పడేశాడు.ఆటో డ్రైవర్ పోలీసులకు చెప్పడంతో బ్యాగ్ ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: