ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సమయంలోనే ఏపీ సీఎం చంద్రబాబు ప్రజాభిప్రాయాలు మంత్రుల మీద ప్రభుత్వం మీద ఎలా ఉన్నది అనే విషయం పైన తెలుసుకునేందుకు చర్చ జరిగినట్లుగా సమాచారం. ఇటీవల వరదల వల్ల సీఎం చంద్రబాబు అక్కడే ఉండి పరీక్షించి అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవడంతో పాటుగా 70 ఏళ్ల వయసులో కూడా ఇంతలా కష్టపడడం వల్ల చాలామంది చంద్రబాబును మెచ్చుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే టిడిపి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో కూడా వారి యొక్క పనితీరుపైన ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా కొంత సమాచారాన్ని తీసుకున్నట్లు సమాచారం.


అయితే సీఎం చంద్రబాబు కష్టపడినంతగా ఆయన ఎమ్మెల్యేలు ఎవరు కూడా కష్టపడలేదని గ్రౌండ్ లెవెల్ లో తమ సొంత ప్రయోజనాలు కోసమే చాలామంది ప్రయత్నిస్తున్నారంటూ.. ముఖ్యంగా మహిళ నేతల విషయంలో వారి యొక్క కుటుంబ సభ్యుల ప్రేరణ ఎక్కువగా ఉన్నదని ఉచిత ఇసుక విషయంలో కూడా చాలామంది దోచేస్తున్నారనే విధంగా రిపోర్ట్ అందిందట. అయితే ఇందులో కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఇచ్చిన పిలుపును కూడా పట్టించుకోవడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి.


వరదల వల్ల ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలు బాగా పనిచేసిన.. 70 శాతం పైగా మంది ఎమ్మెల్యేల పనితీరు బాగా లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా దందాలు చేస్తున్న అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న సరే కచ్చితంగా వారి మీద కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి పరిశీలిస్తున్నారట. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావస్తున్న మంత్రుల పనితీరు ఎలా ఉందనే విషయం పైన కూడా ఆరా తీస్తున్నారట. అయితే ఈ వంద రోజున పాలనలో సీఎంగా తనకి తాను సంతృప్తిని ఇచ్చిన ఎమ్మెల్యేల వల్ల అసంతృప్తి మొదలవుతోందట. అయితే కొంతమంది నేతలు మాత్రం.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటూ ప్రజలు నిలదీస్తున్నారని అందుకే ఎలాంటి పని చేయడానికి ముందుకు సాగడం లేదనే విధంగా రిపోర్ట్ అందిస్తున్నారట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఏపీ చాలా సంక్షోభాలకు గురవుతోందని కూడా చెప్పవచ్చు. మరి ఇలాంటి సమయంలో సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: