ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలనను నుంచి విముక్తి కలిగిన సెప్టెంబర్ 17పై రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17ను ఎలా నిర్వహించుకోవాలనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. ఈ రోజును కొందరు విలీన, ఇంకొందరు విమోచన దినోత్సవం అని సంబోధిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఈ శుభదినాన్ని ప్రజాపాలన దినోత్సవం గా జరపడం సముచితమని భావించాం. 1948లో తెలంగాణ ప్రజలు నిజాం రాచరిక వ్యవస్థను కూలదోసి ప్రజా పాలనకు నాంది పలికారు. అందుకే ప్రజా కోణాన్ని జోడిస్తూ ఈ పేరును పెట్టాం అని తెలిపారు.ఇదిలావుండగాతెలంగాణలోని 33 జిల్లాల్లో జెండా ఆవిష్కరణ చేసే ప్రజా ప్రతినిధుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. కాగా, గత ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా హైదరాబాద్ పపరేడ్ గ్రౌండ్‌లో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తాజాగా, రాష్ట్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది.