కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలో ఉన్నది.. ఇప్పటికే మూడుసార్లు మోదీ కేంద్రంలో విజయాన్ని అందుకోవడంతో త్వరలోనే జమిలి ఎన్నికలు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎప్పుడు అనే విషయం చెప్పకపోయినా కూడా  ఈ ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉండదని విషయం పైన చాలా సంకేతాలు కనిపిస్తున్నాయి. దేశమంతటా కూడా ఒకేసారి రాష్ట్ర, లోక్సభ ఎన్నికలు జరిగే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రధాన మోడీ తో పాటు కీలకమైన భాగస్వాములతో కూడా పలు చర్చలు జరిపిన తర్వాతే త్వరలో మాట్లాడే అవకాశం ఉందని అందరిని ఒప్పించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఒకవేళ జమిలి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరిగితే.. ఎవరిది అవకాశం ఉంటుంది అనే విషయం మాత్రం ఇప్పుడు అన్ని పార్టీలలో ఒక్కసారిగా చర్చలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి పార్టీలు బలంగానే ఉన్నాయంటూ 100 రోజుల పాలన అద్భుతంగా ఉందంటూ మంత్రులు కూడా బాగానే పని చేస్తున్నారంట చెప్పుకుంటున్నారు. అలాగే త్వరలోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామని.. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు, యువతకు నిరుద్యోగ భృతి అందజేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే జమిలి ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా చంద్రబాబు కనిపిస్తోంది. మరొకసారి జనసేన టిడిపి బిజెపి కాంబినేషన్లో విజయం ఖాయమని నమ్ముతున్నారు..


ఇక వైసిపి మాత్రం ఇప్పటికే జగన్ చేసిన కొన్ని మంచి పనుల వల్ల జిల్లాల పర్యటనలలో కూడా భారీగానే రెస్పాన్స్ లభించింది.. త్వరలోనే ముఖ్య నేతలతో కూడా సమావేశం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు అధ్యక్షులతో పాటు పార్టీలో కొంతమందిని నియమించారు. ఒకవేళ జమిలి ఎన్నికలు  జరిగితే కచ్చితంగా ప్రజా తీర్పు తమకి అనుకూలంగా ఉంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అలాగే గతంలో ఇచ్చిన నవరత్నాలు, వాలంటరీ వ్యవస్థ, రేషన్ వ్యవస్థ ,వరద సమయంలో దగ్గరుండి మరి కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ పని చేయించడం.. ఇవే కాకుండా ఇతరత్రా అంశాలు కూడా ఏపీ ప్రజలలో చాలా బలంగా ఉన్నాయని అందుకే ముందస్తు ఎన్నికలకు కూడా పార్టీ సిద్ధంగా ఉందంటూ తెలియజేస్తున్నారట. ప్రజలు కూడా ఈసారి జగన్ను ఆశీర్వదిస్తారనే విధంగా నమ్మకంతో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎవరిది మాతో వారు ఉన్నారు.ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే మరి ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: