కేంద్ర మంత్రి కుమార స్వామితో మాట్లాడానని కూడా వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం కొంత డబ్బులిచ్చి ఆపరేట్ చేయడానికి ముందుకెళ్తున్నారని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు కూడా ఆలోచించుకోవాలని కోరారు. బెస్ట్ మేనేజ్మెంట్ పెట్టుకుని.. శాశ్వతంగా లాభాల బాట పట్టించాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.
ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లన్నీ లాభాల్లో ఉంటే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎందుకు నష్టాల్లోకి వస్తుందో ఆలోచించాలని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రుల హక్కు.. విశాఖ హక్కు అనేది నిరూపించుకోవాలంటే కష్టపడి పని చేయాలని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకునేందుకు సర్వ శక్తులా ప్రయత్నిస్తామని క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దాని కోసం ప్రణాళిక రూపొందిస్తామన్నారు.
గత ఐదేళ్లల్లో ఎప్పుడైనా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారా.? అని ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్దామని నాడు సీఎంగా ఉన్నప్పుడు స్పందించారా..? ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారా..? అని నిలదీశారు. ఏం చెప్పినా నమ్మే రోజులు పోయాయన్నారు. కొత్త మెడికల్ కాలేజీల గురించి జగన్ ఎలాంటి జీవోలు ఇచ్చారు..? అని తెలిపారు. జీవోలను ఆయన ముఖానికి కట్టి తిప్పుతామని... కొత్త మెడికల్ కాలేజీల విషయంలో జగన్ ఎలాంటి జీవోలిచ్చారో చదువుకోండని చురకలు అంటించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.