అయితే తాజాగా పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సంచలన ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి గతంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఫిర్యాదు చేశానని సినిమా ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ప్రశ్నించాలని ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. గతంలో కూడా గురూజీ అంటూ పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
ప్రస్తుతం జానీ మాస్టర్ వివాదంకు సంబంధించి దుమారం రేగుతున్న తరుణంలో పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ ఒకింత చర్చకు దారి తీసింది. జల్సా సినిమాలో మూవీ ఆఫర్ విషయంలోనే త్రివిక్రమ్, పూనమ్ మధ్య గ్యాప్ ఏర్పడిందని ఇండస్ట్రీలో పలు సందర్భాల్లో వినిపించింది. పూనమ్ కౌర్ చేసిన పోస్ట్ కు 4000కు పైగా లైక్స్ రాగా ఈ వివాదం విషయంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.
పూనమ్ కౌర్ త్రివిక్రమ్ వివాదం విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం సైలెంట్ గానే ఉన్నారు. ఆయన ఈ కాంట్రవర్సీ గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడటం లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సైలెన్స్ ను బ్రేక్ చేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇండస్ట్రీలో అందరికీ మంచి అభిప్రాయం ఉంది. ఆయనపై ఒక హీరోయిన్ ఆరోపణలు చేయడం అందరికీ షాకిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదానికి పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి.