తన పుట్టిన రోజు అయినా ప్రధాని మోదీ విశ్రాంతి తీసుకోలేదు. విధి నిర్వహణను పక్కన పెట్టలేదు. ఎప్పటి లాగే ఈ సారి కూడా తన జన్మదినం సందర్భంగా ప్రజా సేవలోనే నిమగ్నమయ్యారు. తమ అభిమాన నాయకుడి పుట్టిన రోజు కావడంతో బీజేపీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
జన్మదినం రోజు ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు పథకాలను ఆయన ప్రారభించారు. పేదల సొంత ఇంటి కల నిజం చేసేందుకు ప్రధాని పీఎం ఆవాస్ యోజన పథకాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ఇళ్లను నిర్మించారు. ఈ క్రమంలో నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా మరో 26 లక్షల గృహాలను కానుకగా ఇచ్చేందుకు మోదీ నిర్ణయించారు.
ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొన్న మోదీ ఈ మేరకు ప్రకటన చేశారు. భువనేశ్వర్ లోను గడకానా మురికివాడలో ప్రధాని పర్యటించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ఇళ్ల నిర్మాణం గురించి వారికి వివరించి చాలా సేపు మాట్లాడారు.
మరోవైపు తన జన్మదినం సందర్భంగా మోదీ మరో స్కీం కూడా ప్రారభించారు. సుభద్ర యోజన పేరుతో ఏటా కోటి మందికి పైగా పేద మహిళలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ఆయన ప్రకటించారు. ఈ సొమ్ము ప్రతి ఏడాది రెండు వాయిదాలతో మహిళల ఖాతాలో జమ అవుతుందని వెల్లడిచారు. భువనేశ్వర్ లోని జనతా మైదాన్ వేదికగా నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. ఒడిశా రాష్ట్రంలో ఎన్నికల సమయంలో మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తామని బీజేపీ స్పష్టం చేసింది. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దీనిని ప్రకటించింది. సరిగ్గా ప్రధాని జన్మదినం సందర్భంగా ఈ పథకాన్ని ప్రారభించింది. పూరి జగన్నాథుడి సోదరుడు భద్ర పేరు మీద ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.