విషయం ఏమిటంటే... ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డి సముద్ర మార్గంలో విదేశాలకు జంప్ జిలానీ అని గుసగుసలు వినబడుతున్నాయి. చెన్నై నుంచి కుటుంబ సభ్యులతో సహా విదేశాలకు వెళ్లినట్టు ఏసీబీ గుర్తించింది. కోస్ట్ గార్డ్‌లో పనిచేసిన అనుభవంతో వెంకటరెడ్డి షిప్‌లో విదేశాలకు పారిపోయినట్టు ఏసీబీ కనిపెట్టేసింది. అయితే venkat REDDY' target='_blank' title='వెంకట్‌రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వెంకట్‌రెడ్డి ఏ దేశానికి వెళ్లారో గుర్తించేందుకు ఏసీబీ అధికారులు ప్రస్తుతం ట్రై చేస్తున్నారు. రేపో మాపో రెడ్ కార్నర్ నోటీస్ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం తమ అక్రమాలను వెలికితిస్తుందనే భయంతోనే వెంకటరెడ్డి ఈ మాస్టర్ ప్లాన్ వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇసుక పర్మిట్లు ఇవ్వడంలో అనేక అవకతవకలు చేసారని, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా వ్యవహరించారంటూ వెంకటరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే గత ప్రభుత్వంలో ఇసుక, బొగ్గు, బీచ్ శాండ్, గనుల వ్యవహారంలో వెంకటరెడ్డి పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు. దాంతో వెంకట్ రెడ్డిని సస్పెండ్ చేయడంతోపాటు కేసు నమోదు చేయాలని సీఎం చంద్రబాబుకు గనుల శాఖ ఉన్నతాధికారులు సిఫార్స్ చేశారు. అంతే కాకుండా ఏపీఎండీసీ ఎండీగా వెంకటరెడ్డి తీసుకున్న పలు కీలక నిర్ణయాల వెనుక విజయసాయి రెడ్డి హస్తం ఉందని వినికిడి. ఈ నేపథ్యంలోనే విజయసాయి రెడ్డి చార్టెడ్ అకౌంటెంట్ కాదు... చీటెడ్ అకౌంటెంట్ అని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఓ రేంజులో ఏసుకున్నారు.