మాజీ మంత్రి వైసిపి పార్టీలో కీలకమైన నేతగా పేరుపొందిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. ముఖ్యంగా వైసిపి పార్టీ అధినేత జగన్ కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. గత ప్రభుత్వంలో  రెండవసారి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఆయన నుంచి విభేదాలు వచ్చాయని అందుకే అసంతృప్తిగా ఉన్నారు అనే విధంగా వార్తలు వినిపించాయి. అప్పుడు కూడా మళ్ళీ వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి బుజ్జగించడంతో వైసిపి పార్టీలోనే ఉన్నారు. కానీ ఎన్నికలలో పోటీ చేసి కూడా 2024 లో ఓడిపోవడం జరిగింది.


ఎన్నికల ఫలితాల అనంతరం ఒకానొక దశలో ఆయన జనసేన పార్టీలో చేరుతున్న ప్రచారం కూడా చాలా వినిపించేవి. అయితే ఇప్పుడు తాజాగా వైసిపి పార్టీకి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేసినట్లయితే తెలుస్తోంది. అందుకు సంబంధించిన లేఖను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి పంపించినట్లు సమాచారం. పార్టీ తీరు పైన ఎన్నికల సమయం నుంచి తాను అసంతృప్తిగా ఉన్న విషయాన్ని ఇటీవల జగన్ తో భేటీ అనంతరం కూడా మాట్లాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి బెట్టు విడడం లేదు. దీంతో ఈ రోజున వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పినా బాలినేని రేపటి రోజు డిప్యూటీ  సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన తర్వాత అనంతరం జనసేన పార్టీలోకి చేరే విధంగా చర్చిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


మొదటి నుంచి వైయస్ కుటుంబానికి మద్దతుగా ఉండడమే కాకుండా జగన్ కి కూడా బంధువు అవుతారట బాలినేని.. 2012 కు జరిగిన ఉప ఎన్నికలలో కూడా వైసీపీ పార్టీ నుంచి గెలిచారు.ఆ తర్వాత జగన్ హయాంలో మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. బాలినేని రాజీనామా చేయకముందే కొంతమంది టీడీపీ, జనసేన పార్టీలో చేరారు. బాలినేని కూడా జనసేన పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒంగోలు  మున్సిపల్ కార్పొరేషన్ కూడా త్వరలోనే టిడిపి పార్టీలోకి జమా కాబోతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా వైవి సుబ్బారెడ్డి తో కూడా బాలినేని మధ్య రాజకీయంగా విభేదాలు ఉన్నాయని వార్తలు అయితే వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: