* రెడ్డి నేతలను లాగేసుకుంటున్న బిజెపి
* ఏపీలో బలంగా తయారవుతున్న జనసేన
* టిడిపికి నారా లోకేష్ లాంటి బలమైన నేతలు అండ
* వైసిపి చుట్టూ కేసులు, జగన్ అవినీతి
* జాతీయ పార్టీలో వైసిపి విలీనం అయితేనే జగన్ కు మేలు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి పార్టీ పరిస్థితి అత్యంత భయంకరంగా మారిపోయింది. మొన్నటి ఎన్నికల్లో వైసిపి పార్టీ దారుణంగా ఓడిపోవడమే దీనికి కారణం అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ 175 స్థానాలు గెలుస్తాయని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ రియాల్టీకి వచ్చేసరికి కేవలం వైసీపీ పార్టీకి 11 స్థానాలు రావడంతో అందరూ షాక్ అయ్యారు.


అటు తెలుగుదేశం కూటమి పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి 11 స్థానాలు రావడంతో షాక్ అవ్వడం జరిగింది. వైసిపి పార్టీ మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన 70 నుంచి 80 స్థానాలు వచ్చే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ రియాల్టీకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డికి అత్యంత దారుణమైన ఓటమి ఎదురైంది.


అయితే... జగన్మోహన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలలో చేసిన తప్పిదాల వల్ల ఈ ఓటమి ఎదురైందని కొంతమంది చెబుతున్నారు. అలాగే మరి కొంత మంది... ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ఉండడం కారణంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారని వాదిస్తున్నారు. అయితే.. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయినప్పటికీ జనసేన మాత్రం.. బాగా పుంచుకుంది. మరో ఐదు సంవత్సరాలలో జనసేన పార్టీ.. మరింత బలంగా తయారయ్యే ఛాన్స్ ఉంది.  అటు బిజెపి కూడా రెడ్డి నేతలను లాగేసుకునే ప్రయత్నం చేస్తోంది.


రెడ్డి నేతలందరూ బిజెపిలోకి వెళ్తే వైసీపీ పార్టీ మరింత బలహీన పడే ఛాన్స్ ఉంది. అటు వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీని కాస్త బలంగా చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో... వైసీపీ పార్టీ ఏదైనా ఒక జాతీయ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని కొంతమంది చెబుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు లాంటి నేతను.. కొట్టాలంటే కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీలో వైసీపీని విలీనం చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అలాంటప్పుడు జాతీయ పార్టీ అండ్ జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. అలా చేస్తే కచ్చితంగా మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవతరించడం ఖాయమని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: